Vijay Thalapathy: బాబోయ్.. 10 నిమిషాల సీన్ కోసం ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారా ?.. దళపతి సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న రూమర్స్..

ప్రస్తుతం అతను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‏లో తన 68వ సినిమా చేస్తున్నారు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో దళపతి సరసన నటి మీనాక్షి చౌదరి నటిస్తోంది. అలాగే 90's డ్రీమ్ గర్ల్ స్నేహా, లైలా ఇద్దరూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైక్ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్ తదితరులు కూడా తలపతి 68లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులో లవ్ టుడే బ్యూటీ ఇవానా విజయ్ చెల్లిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Vijay Thalapathy: బాబోయ్.. 10 నిమిషాల సీన్ కోసం ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నారా ?.. దళపతి సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న రూమర్స్..
Thalapathy 68
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2023 | 6:32 PM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు హీరో విజయ్ దళపతి. ఇందులో సంజయ్ దత్, త్రిష కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ సక్సెస్ అనంతరం.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు విజయ్. ప్రస్తుతం అతను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‏లో తన 68వ సినిమా చేస్తున్నారు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో దళపతి సరసన నటి మీనాక్షి చౌదరి నటిస్తోంది. అలాగే 90’s డ్రీమ్ గర్ల్ స్నేహా, లైలా ఇద్దరూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైక్ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్ తదితరులు కూడా తలపతి 68లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఇందులో లవ్ టుడే బ్యూటీ ఇవానా విజయ్ చెల్లిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని టైమ్‌ ట్రావెల్‌ ఫిలిం కావచ్చని సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో మునుపెన్నడూ చూడని విజయ్ ఈ సినిమాలో కనిపిస్తాడని ఇటీవల డైరెక్టర్ వెంకట్ ప్రభు చెప్పడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ గురించి ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పది నిమిషాలపాటు ఉండే సీన్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకు నిర్మాణ సంస్థ ఏజీఎస్ కూడా అంగీకరించిందని తెలుస్తోంది. అలాగే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. అది కూడా తండ్రీకొడుకులుగా కనిపించనున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో విజయ్ టీనేజ్ లుక్ లో కనిపించాల్సి ఉందని.. అందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు. దాదాపు దాదాపు 10 నిమిషాల పాటు వచ్చే విజయ్ టినేజ్ లుక్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ సెటప్ మొత్తానికి మేకర్స్ దాదాపు 6 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నారట. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.