Mahesh Babu: ఇది మీకు కోసమే నాన్న.. కృష్ణ బర్త్ డే స్పెషల్‌గా మహేష్ బాబు లుక్

దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.

Mahesh Babu: ఇది మీకు కోసమే నాన్న.. కృష్ణ బర్త్ డే స్పెషల్‌గా మహేష్ బాబు లుక్
Mahesh Babu, Krishna
Follow us

|

Updated on: May 31, 2023 | 11:06 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు ప్రీ లుక్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు.

కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ , త్రివిక్రమ్ సినిమానుంచి టైటిల్ ను, పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మహేష్ ప్రీ లుక్స్ ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా కృష్ణ పుట్టిన రోజు స్పెషల్ గా మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు.

మహేష్ తలకు గుడ్డ కట్టుకుంటూ.. విలన్స్ పై ఫైట్ కు రెడీ అవుతున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ రోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి.. ఇది మీకోసం నాన్న అంటూ తన కొత్త మూవీ పోస్టర్ ను షేర్ చేశారు మహేష్. ఈ మాస్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట వైరల్ అవుతోంది ఈ పోస్టర్.