బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ఆమె నటించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ అయిన షెజాదా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం జూన్ 16 విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకి జోడిగా నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కృతి సనన్. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె ఫోటోలను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.