Mahesh Babu: పెళ్లిరోజు సందర్భంగా అందమైన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన మహేష్ ..
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైనా మహేష్ అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైనా మహేష్ అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సూపర్ స్టార్ గా ఎదిగి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. మహేష్ బాబు హీరోయిన్ నమృత శిరోద్కర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు మహేష్ బాబు వివాహం జరిగి నేటికి 17 సంవత్సరాలు పూర్తయింది. వంశీ సినిమాలో కలిసి నటించారు మహేష్ బాబు, నమ్రత. ఆ సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. అదే ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. నమ్రత విషయం తన తండ్రి కృష్ణకు చెప్పినపుడు.. ఆయన అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు అని ఇటీవలే మహేష్ బాబు తెలిపారు.
మహేష్, నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. వీరి జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో పాల్గొన్న మహేష్ ను పెళ్లి గురించి అడిగారు బాలయ్య. పెళ్లిగురించి చెప్తూ చాలా సిగ్గుపడ్డారు మహేష్. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు.. నాన్న గారిని అడిగాను ఆయన అంత ఈజీగా ఒప్పుకోలేదని మహేష్ తెలిపాడు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో మహేష్ తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోని షేర్ చేసి స్పెషల్ పోస్ట్ చేశారు. తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”అప్పుడే 17 సంవత్సరాలు పూర్తయ్యింది. హ్యాపీ యానివర్సరీ. ఇలాంటి రోజులు మరిన్ని జరుపుకోవాలి. ప్రేమతో” అని విష్ చేశారు మహేష్. మహేష్ పోస్ట్ పై పలువురు సినిమ తారలు, అభిమానులు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు నేడు ఏపీ ముఖ్య మంత్రి జగన్ ను కలవడానికి తాడేపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ కు ఫ్లైట్ లో పెళ్లిరోజు శుభాకాక్షలు తెలిపారు చిరంజీవి, ప్రభాస్ , రాజమౌళి, కొరటాల శివ.
Mahesh New
So easily 17! Happy anniversary NSG!! Many more to us… it’s all about love ♥️♥️♥️ pic.twitter.com/Lw76cY77zu
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2022