sarkaru vaari paata : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. త్వరలోనే సర్కారు వారి పాట అప్డేట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చారు.

sarkaru vaari paata : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. త్వరలోనే సర్కారు వారి పాట అప్డేట్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2021 | 8:58 PM

sarkaru vaari paata : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్లార్కారు వారి పాట షూటింగ్ కు కూడా ప్యాకప్ చెప్పారు చిత్రయూనిట్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తుంది. హీరో తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. దాంతో రంగంలోకి దిగిన హీరో, ఆ బిజినెస్ మెన్ తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అంటూ ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్స్ త్వరగా ప్రారంభించే దిశగా మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా మేకర్స్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. మొన్నే అప్డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఆశించారు. ఆ విషయంలో అభిమానులకి నిరాశే మిగిలింది. కానీ తాజాగా సూపర్ స్టార్ సర్కారు వారి చిత్రబృందం నుండి అధికారికంగా ఓ కబురు పంపారు. ఏంటంటే.. “సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి” అంటూ పిలుపునిచ్చారు.

మరిన్ని ఇక్కడ  చదవండి :

Vaishnav Tej: ఆమె అంటే ఇష్టం మాత్ర‌మే కాదు.. ప్రేమ‌. మ‌న‌సులో మాట చెప్పిన మెగా హీరో వైష్ణ‌వ్‌.. ఆ హీరోయిన్ ఎవ‌రంటే..

Padma Awards: పద్మ పురస్కారాలకు నామినేష‌న్ల చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 15… సోనూసూద్ పేరును సిఫార్సు చేసిన‌..

పాన్ ఇండియా స్టారా … మజాకానా.. రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఫేస్ బుక్ ను షేక్ చేస్తున్న డార్లింగ్