పాన్ ఇండియా స్టారా … మజాకానా.. రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఫేస్ బుక్ ను షేక్ చేస్తున్న డార్లింగ్

చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి పలకరిస్తారు.. ఆయన సినిమాల్లాగే ఆయన పర్సనల్ అప్డేట్స్ కూడా వెతికితే తప్ప కనిపించవు.

పాన్ ఇండియా స్టారా ... మజాకానా.. రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఫేస్ బుక్ ను షేక్ చేస్తున్న డార్లింగ్
Prabhas

Prabhas:

చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి అలా వచ్చి పలకరిస్తారు.. ఆయన సినిమాల్లాగే ఆయన పర్సనల్ అప్డేట్స్ కూడా వెతికితే తప్ప కనిపించవు. కానీ.. కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనే క్రెడిట్ మాత్రం ఆయన దగ్గర భద్రంగా ఉంటుంది.;ఇంతకు ఆయన ఎవరో తెలుసా .. ఇంకెవరు… డార్లింగ్ ప్రభాస్..! కటౌట్ చూసి కొన్నికొన్ని కాదు అన్నీ నమ్మేయ్యాల్సిందేనా? సోషల్ మీడియాలో డార్లింగ్ మూమెంట్స్ నీ, వాటికొచ్చే ఫాలోయింగ్ ని కూడా నమ్మేయ్యాల్సిందేనా? ఎస్.. నెట్లో మిగతా హీరోల కంటే చాలా యూనిక్ స్టయిల్ ని మెయింటెయిన్ చేస్తున్న ప్రభాస్ చుట్టూ.. ఈ విధంగా ఒక రకమైన మిస్టరీ అల్లుకుంటోంది. ఫేస్ బుక్ లో 23.5 మిలియన్లు… అంటే 2 కోట్ల 35 లక్షల మంది ఫాలోయర్లున్నారు ప్రభాస్ కి. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పడం లాంటివి తప్ప చెప్పుకోదగ్గ రిమార్కబుల్ పోస్టులేవీ డార్లింగ్ ఖాతాలో లేవు. అయినా ఫాలోయర్ల స్కోర్ మాత్రం తగ్గడం లేదు.

ఇక రీసెంట్ గా ఇన్ స్టాలో ఖాతా తెరిచి ఆరున్నర మిలియన్ల మందిని పోగేసుకున్నారు సాహో స్టార్. ఈ రెండు డయాస్ ల మీద కలిపి 30 మిలియన్లకి చేరుకుంది బాహుబలి ఆర్మీ. మరో పాపులర్ హ్యాండిల్ ట్విట్టర్ జోలికి మాత్రం అసలు వెళ్లడం లేదు ప్రభాస్. ఇవ్వాళారేపూ ట్రెండ్ లో ఉండాలంటే ట్విట్టర్ చాలా క్రూషియల్. బాలీవుడ్ సెలెబ్స్ అయితే టోటల్లీ… ట్విట్టర్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు. ఫేస్ బుక్ ని చాలా రేర్ గా టచ్ చేస్తారు. నార్త్ లో నిలదొక్కుకుంటున్న ప్రభాస్.. సోషల్ మీడియా సబ్జెక్టులో మాత్రం ఇలా ఏక్ నిరంజన్ స్టయిల్ ఎందుకు మెయింటెయిన్ చేస్తున్నారు… ఫ్యాన్స్ కి ఇదో అంతుబట్టని ప్రశ్న.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..

Pawan Kalyan : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న పవన్ సినిమాలు.. సంక్రాంతికి రానున్న రీమేక్..