Padma Awards: పద్మ పురస్కారాలకు నామినేషన్ల చివరి తేదీ సెప్టెంబర్ 15… సోనూసూద్ పేరును సిఫార్సు చేసిన..
Padma Awards: ఆయా రంగాల్లో విశేషమైన సేవలందించన వారికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు అందిస్తోందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను అందిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి...
Padma Awards: ఆయా రంగాల్లో విశేషమైన సేవలందించన వారికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులు అందిస్తోందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను అందిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డును ఇస్తారు. ఈ క్రమంలోనే 2022 పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మీకు తెలిసిన గొప్ప వ్యక్తులను పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే నామినేషన్ల స్వీకరణకు 2021 సెప్టెంబర్ 15ను చివరి తేదీగా నిర్ణయిస్తూ.. కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్‌లైన్‌లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో స్వీకరిస్తామని తెలిపింది.
సోనూసూద్ పేరును సిఫార్సు చేసిన బ్రహ్మాజీ..
కరోనా సమయంలో అడిగిందే అదునుగా ఎంతో మందికి సాయం చేసిన కలియుగ కర్ణుడిగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ పేరును పద్మ అవార్డుకు నామినేట్ చేశాడు నటుడు బ్రహ్మాజీ. సోనూ సూద్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తను గట్టిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తన ప్రతిపాదనను సమర్ధించే వారంతా తన ట్వీటను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు. ఇక ఈ ట్వీట్‌కు బదులిచ్చిన సోనూ.. తనదైన శైలిలో స్పందించాడు. సోనూ ట్వీట్ చేస్తూ.. 135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
#padmavibhushan for @SonuSood ..if u agree with me..pl retweet.. #padmavibhushsnforsonusood #respectsonu https://t.co/cqV4We9uX3
— BRAHMAJI (@actorbrahmaji) June 11, 2021
The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.?? Humbled ? https://t.co/VpAZ8AqxDw
— sonu sood (@SonuSood) June 11, 2021
Also Read: Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..
Yellandu TRS Mla: తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ స్పీడు పెంచింది.. తాజా అప్‌డేట్ ఇది