Yellandu TRS Mla: తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
Yellandu TRS Mla: అమ్మ అందరికీ అమ్మే... కడుపున పుట్టిన పిల్లలైనా.. అనాథలైన మాతృహృదయం ఒకలాగే స్పందిస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే మరోసారి...
Yellandu TRS Mla: అమ్మ అందరికీ అమ్మే… కడుపున పుట్టిన పిల్లలైనా.. అనాథలైన మాతృహృదయం ఒకలాగే స్పందిస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే మరోసారి రుజువు చేశారు. తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన అన్నా చెల్లెళ్లను దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందుకు చెందిన గణేశ్, స్రవంతి భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు బాబు కృష్ణన్ కు ఏడేళ్లు, పాప హరిప్రియకు ఐదేళ్లు.. అయిదు విధి వక్రించి తండ్రి గణేష్ కి క్యాన్సర్ వ్యాధి సోకడంతో మూడేళ్ళ క్రితమే మరణించాడు. పిల్లలిద్దరిని తానె తల్లిదండ్రి అయి పెంచుకుంటుంది. దేవుడు మళ్ళీ చిన్న చూపు చూశాడు.. స్రవంతికి కిడ్నీ వ్యాధి సోకింది. దీంతో మూడు నెలల క్రితం మరణించింది. దీంతో కృష్ణన్, హరిప్రియ అనాథలయ్యారు. అమ్మమ్మ చెంతకు చేరుకున్నారు. ఆమె ఆర్ధిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే దీంతో పిల్లల తండ్రి గణేష్ స్నేహితుడు ఈ విషయం తెలియజేస్తూ.. కేటీఆర్ కు ట్విట్టర్ టాగ్ చేశాడు.
ఈ ట్విట్ పై స్పందించిన కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి. అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ చిన్నారుల ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంటానని.. వారి చదువు బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు ఎమ్మెల్యే, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనాథ పిల్లలను అమ్మలా అక్కున చేర్చుకున్న ఎమ్మెల్యే హరిప్రియ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.