TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!

TV9 Alert: కరోనాతో వచ్చే ఇబ్బందులతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కరోనా సోకిన వారికి వచ్చే బాధలతో జనం భయపడి ఉన్నారు.

  • Publish Date - 7:09 pm, Fri, 11 June 21
TV9 Alert: ఆనందయ్య మందుకు డూప్లికేట్..ఆయన శిష్యులం అంటూ దోచేస్తున్న కేటుగాళ్ళు..టీవీ9 పరిశీలనలో విస్తుపోయే నిజాలు!
Tv9 Alert


TV9 Alert: కరోనాతో వచ్చే ఇబ్బందులతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కరోనా సోకిన వారికి వచ్చే బాధలతో జనం భయపడి ఉన్నారు. అందుకే, ఏ చిన్న విషయం కరోనా అంతు చూసే అవకాశం ఉందని తెలిసినా ప్రజలు దాని విషయంలో వెనుకా ముందూ ఆలోచించకుండా పరుగులు తీస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రచారంలో వచ్చిన ప్రతి మందూ జనం ఇబ్బడి ముబ్బడిగా వాడే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఆ మందులపై సొంత ప్రయోగాలూ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటె.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాపై సంజీవినిలా పనిచేస్తోందని ప్రజలు నమ్ముతున్నారు. ఆ మందులో ఎటువంటి దోషాలూ లేవు వాడవచ్చు అని శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున కృష్ణపట్నంలో కరోనా బాధితుల కోసం ఆనందయ్య మందు సిద్ధం చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నారు.

ఆనందయ్య మందు ఇలా తాయారు చేసి ఇవ్వడం మొదలెట్టారో లేదో రాష్ట్రవ్యాప్తంగా డూప్లికేటు గాళ్ళు సిద్ధం అయిపోయారు. అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆనందయ్య మందు పేరుతో మందు తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. వీరంతా ఆనండయ్య శిష్యులమని చెప్పుకుంటున్నారు. దీంతో పాపం ప్రజలు అది నిజం అనుకుని ఆ మందుకోసం బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిపై టీవీ9 ప్రత్యెక దృష్టి సారించింది. అసలు ఆనందయ్య శిష్యులు ఎంతమంది? వారు ఎక్కడెక్కడ మందులు సిద్దం చేసి ప్రజలకు అందిస్తున్నారు? వంటి వివరాలు టీవీ9 సేకరించింది. అయితే, ఈ ప్రయత్నంలో విస్తుగోలిపే నిజాలు తెలిశాయి. ఒక్క కృష్ణపట్నంలో తప్ప మరెక్కడా ఆనందయ్య మందు తయారు చేయడం లేదు. ఆనందయ్య శిష్యులు అందరూ ఆయనతోనే ఉన్నారు. ఒక్క ఆయన కుమారుడు మాత్రం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రత్యేకంగా అక్కడ మందు తయారు చేసి అక్కడి ప్రజలకు అందిస్తున్నారు. అంతే తప్పితే ఆనండయ్య పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో అందుబాట్లోకి వచ్చిన మందుకీ ఆనందయ్యకీ ఎటువంటి సంబంధం లేదు.

ఈ విషయంపై టీవీ9 తొ ఆనందయ్య మాట్లాడారు. తాము కృష్ణపట్నంలో తప్పితే ఎక్కడా మందు తయారు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా మందు కావాలి అనుకుంటే, వారు మందుకోసం అవసరమయ్యే ముడి పదార్ధాలు తెచ్చుకుంటే..క్రిష్ణపట్నంలోనె మందు తాయారు చేసి ఇవ్వడం జరుగుతుందని ఆనందయ్య చెబుతున్నారు.

నకిలీల వెంట పడకండి..

తెలుగురాష్ట్రాల్లో నకిలే మందులు చేస్తున్న చోట టీవీ9 పరిశీలన జరిపింది. అక్కడ విస్తుబోయే విషయాలు తెలిశాయి. నకిలీ మందు చేస్తున్న వారు ఆనందయ్య మందు ఇస్తున్నామనే ప్రజలకు చెబుతున్నారు. దీంతో ప్రజలూ ఆ మాటలు నమ్ముతున్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే..ఏవో నాలుగు మూలికలో.. ఆకులో వేళ్ళూ కలిపేస్తే మందు తయారు అయిపోదు. దానికి ఓ విధానం ఉంటుంది. ఏ రకం మూలిక ఎంత వరకూ వేయాలి. ఎంత నూరాలి.. ఎన్నిరకాల మూలికలు ఎప్పుడు కలపాలి ఇలా ఎన్నో దశలు ఉంటాయి. మూలికల పేర్లు తెలిసినంత మాత్రాన మందు చేసేయడం అయ్యేపని కాదు. తగిన మోతాదులో ఆ మూల పదార్ధాలను కలిపితేనే అది మందు అవుతుంది. పనిచేస్తుంది. ఇలా ఇష్టం వచ్చినట్టు చేసేది మందు కావడం మాట అటుంచి అందులో కలిపిన్ మూలికల మోతాదుల్లో తేడా వస్తే అసలుకే ఎసరు వస్తుంది. అందువల్ల ఎవరూ ఈ విధమైన ట్రాప్ లో పడవద్దని ప్రజలకు టీవీ9 విజ్ఞప్తి చేస్తోంది. ఆనండయ్య మందు ప్రస్తుతం కృష్ణపట్నంలో మాత్రమె చేస్తున్నారు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆనందయ్య మందు ఊరూరా డూప్లికేట్ అవుతున్న వైనాన్ని టీవీ9 ప్రత్యేకంగా ప్రసారం చేసింది. ఆ కథనం ఇక్కడ మీకోసం ఇస్తున్నాం.. చూసేయండి.