Varalaxmi Sarathkumar : బాలకృష్ణ సినిమాలో జయమ్మ.. వరలక్ష్మీ శరత్ కుమార్ ను రంగంలోకి దింపుతున్న గోపీచంద్ మలినేని..
హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సీనిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది వరలక్ష్మి.
Varalaxmi Sarathkumar:
హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళ్ భాషల్లో వరుసగా సీనిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది వరలక్ష్మి. తెలుగులో ఇటీవల క్రాక్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్రాక్ లో జయమ్మగా వరలక్ష్మి పండించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడున్న నటుల్లో లేడీ విలన్ అంటే ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. వరలక్ష్మీ శరత్ కుమార్, తెలుగు తెరపై మరోసారి విలన్ గా విజృంభించనుంది .. అదీ బాలయ్య సినిమాలో కావడం విశేషం. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా క్రాక్ కు గోపీచంద్ మలినేనినే దర్శకత్వం వహించారు. ‘క్రాక్’ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు ‘క్రాక్’లో హీరోయిన్ గా చేసిన శ్రుతిహాసన్ ను ఈ సినిమా కోసం ఒప్పించాడు. అదే విధంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ను కూడా తీసుకున్నాడని అంటున్నారు.
కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. అలాగే చాలా కలం తర్వాత బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారని, ఇందులో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :