Rashi Khanna: డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోన్న రాశీఖన్నా.. వరుస వెబ్ సిరీస్‌లకు ఓకే చెబుతూ..
Rashi Khanna: కరోనా తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు తమ హవా కొనసాగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం, సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుండడంతో...
Rashi Khanna: కరోనా తర్వాత ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు తమ హవా కొనసాగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగు పెట్టడం, సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుండడంతో ప్రేక్షకులు సైతం ఓటీటీలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో మారుతోన్న ఈ ట్రెండ్‌ను ఒడిసిపట్టుకుంటున్నారు స్టార్ హీరోయిన్లు ఇప్పటికే తమన్నా పలు వెబ్ సిరీస్‌లలో నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అందాల తార రాశీ ఖన్నా కూడా వెబ్ సిరీస్‌ల్లో ఆసక్తి కనబరుస్తున్నారు. రాశీ ఖన్నా ఇప్పటికే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్’ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో షాహిద్ కపూర్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాక ముందే రాశీ ఖన్నా మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ నటించనున్న వెబ్ సిరీస్‌లో నటించడానికి రాశీ ఖన్నా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ను ఇంగ్లిష్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా ‘లూథర్’ ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే కేవలం వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా.. ఫుల్ టైమ్ సినిమాల్లోనూ సత్తా చాటుతోంది రాశీ. ప్రస్తుతం నాగచైతన్య, గోపిచంద్ సరసన నటిస్తోన్న ఈ చిన్నది ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో రాశీ లీడ్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Payal Rajput: అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్
Nandamuri Balakrishna: దర్శకత్వం బాలయ్య.. హీరో మోక్షజ్ఞ.. మరో క్రేజీ విషయం ఏమిటంటే..