AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakka Commercial: మ్యాచో హీరో గోపీచంద్ న్యూ లుక్ అదిరిందిగా.. పక్క కమర్షియల్ నుంచి పోస్టర్..

టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు.  నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు మారుతి.

Pakka Commercial: మ్యాచో హీరో గోపీచంద్ న్యూ లుక్ అదిరిందిగా.. పక్క కమర్షియల్ నుంచి పోస్టర్..
Rajeev Rayala
|

Updated on: Jun 11, 2021 | 10:48 PM

Share

Pakka Commercial:

టాలీవుడ్ లో తక్కువ టైం లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుల్లో మారుతి ఒకరు.  నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు మారుతి. కామెడీనే ప్రధానాంశంగా మారుతి సినిమాలను తెరకెక్కిస్తూ  అందుకుంటున్నాడు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రీసెంట్ గా మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో కలిసి ప్రతి రోజు పండగే అనే సినిమా చేసాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మ్యాచో హీరో గోపీచంద్ తో కలిసి సినిమా చేస్తున్నాడు మారుతి. పక్క కమర్షియల్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సీటీమార్ అనే టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది.

తాజాగా హీరో గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో మాంఛి జోష్ తో స్టెప్పులు వేస్తూ, మరింత హ్యాండ్సమ్ గా గోపీచంద్ కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జిల్’ విజయాన్ని అందుకుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన ‘ ప్రతి రోజూ పండగే’ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.  దాంతో ఈ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంటుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పాన్ ఇండియా స్టారా … మజాకానా.. రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఫేస్ బుక్ ను షేక్ చేస్తున్న డార్లింగ్

Syed Sohel Ryan: మంచి మనసు చాటుకున్న సోహెల్.. అన్న మాటప్రకారం సామాజిక బాధ్యతతో సహాయం..

Padma Awards: పద్మ పురస్కారాలకు నామినేష‌న్ల చివ‌రి తేదీ సెప్టెంబ‌ర్ 15… సోనూసూద్ పేరును సిఫార్సు చేసిన‌..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!