MAA elections 2021 Winner list: సుడిగాలి సుధీర్‌కు, సంపూర్ణేష్‌కు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ

ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అవకాశం అందుకున్నటువంటి సుడిగాలి సుధీర్... మంచు విష్ణు ప్యానల్ నుంచి బరిలో దిగిన సంపూర్ణేశ్ బాబు భారీగా ఓట్లు సంపాదించారు.

MAA elections 2021 Winner list: సుడిగాలి సుధీర్‌కు, సంపూర్ణేష్‌కు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ
Sudigali Sudheer
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 13, 2021 | 12:06 PM

‘మా’ ఎన్నికలు ముగిసినా వేడి మాత్రం కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తతల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగాయి. హోరాహోరీ పోరులో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఫలితాల అనంతరం నాగబాబు, ప్రకాశ్ రాజ్ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. అంతేకాదు ఇక ఈ ఎన్నికల్లో చాలామందికి  భారీ మెజార్టీ వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలో ఉన్న సుడిగాలి సుధీర్‌తో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు మంచి మెజార్టీతో గెలిచారు. అధ్యక్ష బరిలో నిలచిన మంచు విష్ణుకు 383 ఓట్లు రాగా ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. 109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు.  జనరల్ సెక్రటరీ రఘు బాబుకు 341 ఓట్లు రాగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ 375 ఓట్లను సంపాదించి విజయ బావుటా ఎగరవేశారు. ఇక మంచు విష్ణు ప్యానల్ నుంచి  10 మంది ఈసీ మెంబర్స్ గెలవగా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎనిమిది మంది గెలిచారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అవకాశం అందుకున్నటువంటి సుడిగాలి సుధీర్ 279 ఓట్లను అందుకని గెలుపొందాడు. ఇక మంచు విష్ణు ప్యానల్ నుంచి బరిలో దిగిన సంపూర్ణేశ్ బాబు 285 ఓట్లను సాధించారు.

► జనరల్ సెక్రటరీ – రఘుబాబు (341 ఓట్లు)

►ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్  (375 ఓట్లు)

► జాయింట్ సెక్రటరీలు – ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు)

►వైస్ ప్రెసిడెంట్స్‌ – మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు)

► ట్రెజరర్‌  – శివబాలాజీ (360 ఓట్లు)

ఈసీ మెంబర్స్

శివారెడ్డి – 362 ఓట్లు

గీతా సింగ్ – 342 ఓట్లు

అశోక్ కుమార్ – 336 ఓట్లు

బ్రహ్మాజీ – 334 ఓట్లు

శ్రీలక్ష్మి – 330 ఓట్లు

సి మాణిక్ – 326 ఓట్లు

ప్రభాకర్ – 319 ఓట్లు

తనీష్ – 306 ఓట్లు

శ్రీనివాసులు – 296 ఓట్లు

హరనాథ్‌బాబీ – 296 ఓట్లు

సురేష్ కొండేటి – 294 ఓట్లు

ఎన్. శివన్నారాయణ – 290 ఓట్లు

సంపూర్ణేష్ బాబు – 285 ఓట్లు

శశాంక్ – 284 ఓట్లు

సమీర్ – 282 ఓట్లు

Also Read: రాయచూర్‌ జిల్లాను తెలంగాణలో కలపాలని కోరిన కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే.. కేటీఆర్ స్పందన ఇదే

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!