AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్స్‌ బ్రేక్‌ అప్‌ అవడం తొలిసారేమో.. బిగ్‌బాస్‌ కొత్త ప్రోమో చూశారా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 5 వారాలు ముగించుకొని 6వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్‌ షో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయిన విషయం తెలిసిందే...

Bigg Boss 5 Telugu: చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్స్‌ బ్రేక్‌ అప్‌ అవడం తొలిసారేమో.. బిగ్‌బాస్‌ కొత్త ప్రోమో చూశారా.?
Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 3:42 PM

Share

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 5 వారాలు ముగించుకొని 6వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్‌బాస్‌ షో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయాల్సిన కంటెస్టెంట్స్‌ ఫోటోలను మంటల్లో వేయమని చెప్పగానే కంటెస్టెంట్లు ఫోటోలను నిప్పులో వేస్తూ.. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు గట్టిగా అరుచుకున్నారు. దీంతో హౌజ్ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఇదంతా నిన్నటి (సోమవారం) ఎపిసోడ్‌లో జరిగింది.

ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్‌ కాస్త ఫన్నీ ఫన్నీగా సాగుతున్నట్లు అర్థమవుతోంది. షో నిర్వాహకులు కాసేపటికి కిత్రం విడుదల చేసిన ప్రోమో చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. సన్నీ శ్రీరామ్‌ను ఇమిటేట్‌ చేస్తూ పలకించిన హావభావాలు హౌజ్‌లో నవ్వులు తెప్పించాయి. ఇక హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. ఇక కాజల్‌, సింగర్‌ శ్రీరామ్‌ను ఉద్దేశిస్తూ ‘బ్రేకప్‌ బ్రో.. చరిత్రలో బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ బ్రేకప్‌ ఫస్ట్‌ టైమ్‌ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి శ్రీరామ్‌ ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించాడు. ఇక షణ్ముఖ్‌ ఎలిమినేషన్‌ ప్రాసెస్‌కు సంబంధించి ఫన్నీ కామెంట్స్‌ చేశాడు. ఐన్‌స్టీన్‌ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్‌ అర్థంకావు అని చెప్పుకొచ్చాడు.

అయితే హౌజ్‌లో అంతా ఫన్నీగా కూల్‌గా సాగిపోతుందనుకుంటున్న సమయంలో శ్వేత వర్మ బిగ్గర అరవడంతో హౌజ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతరుల్లోని అగ్లీ సైడ్‌ను బయటకు తీసుకురావడం గేమా అంటూ అరిచేసింది, ఇది ఎలా కరెక్ట్‌ అవుతుంది, అస్సలు కాదంటూ అరిచేసింది. ఇలా కొంచెం ఫన్నీగా, కొంచెం హాట్‌ హాట్‌గా సాగిన నేటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Also Read: Huzurabad Election: హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ సీనియర్లు.. పార్టీ అభ్యర్థిని ఎందుకు ఒంటరిని చేశారు?

Roja: ప్రత్యేకత చాటుకున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‎కు ప్రత్యేక శాలువాతో సత్కారం..

Viral Video: క్యూట్ క్యాట్.. దత్తత తీసుకోవాలంటూ ఎంత ముద్దుగా వెంట పడిందో..! వైరలవుతోన్న వీడియో

2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
2025లో తెలంగాణను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే!
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎక్కడెక్కడంటే..?
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు..డిసెంబర్‌ 31కోసం భారీ ఏర్పాట్లు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
కివీస్ గుండెల్లో వణుకు.. 60రోజుల తర్వాత బ్యాట్ పట్టిన మొనగాడు
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
బంగారం, వెండితో పాటు మరో దెబ్బ.. పెరుగుతున్న మరో లోహం ధరలు
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
ఆరి బద్మాష్‌గా.! జైలుకెళ్లి మారతావ్ అనుకుంటే..
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..