Huzurabad Election: హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ సీనియర్లు.. పార్టీ అభ్యర్థిని ఎందుకు ఒంటరిని చేశారు?

Huzurabad By-Elections 2021: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి..? ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిగా పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలో నిలిపింది.

Huzurabad Election: హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ సీనియర్లు.. పార్టీ అభ్యర్థిని ఎందుకు ఒంటరిని చేశారు?
Huzurabad Congress Candidiate
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 12, 2021 | 2:35 PM

Huzurabad By-Elections 2021: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి..? ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను బరిలో నిలిపింది. పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు కొందరు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత ఒక్క ముఖ్య నేత కూడా అటువైపు చూడటం లేదు. ఇప్పుడు అక్కడ అభ్యర్థి వెంకట్ హుజురాబాద్‌లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంతకూ  కాంగ్రెస్ సీనియర్లు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆటకు ముందే ఎందుకు సైడ్ అయిపోతున్నారు?  ఫలితాన్ని ముందే ఊహించుకుని వెనకడుగు వేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ పాలిటిక్స్ లో హుజురాబాద్ బై పోల్ హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాలన్నీ హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీ.ఆర్.ఎస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పోరును హోరెత్తిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అభ్యర్థి ఎంపికతో మొదలుకొని ప్రతీది ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉంటున్నాయి. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత అభ్యర్థి గా ఎన్.ఎస్.యూ.ఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ను ప్రకటించింది.

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ ల చివరి రోజున బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. నామినేషన్ ల సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ , జిల్లా కు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. అదే రోజు భారీ హంగామా చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని గాంధీ భవన్ ఎన్నికల వ్యూహం పై సమావేశం ఏర్పాటు చేసుకొని పలు అంశాలపై చర్చించారు. మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు.

ఇదంతా బాగానే ఉన్న ప్రచారం విషయంలో ముఖ్యనేతలు సైతం చడీచప్పుడు చేయడం లేదు. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత హుజురాబాద్ వైపు ఏ ఒక్క సీనియర్ నేత కన్నెత్తి చూడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట సభలు సమావేశాలంటూ తిరుగుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇలా ముఖ్య నేతలెవరూ హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదు. జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం ఉప ఎన్నికల వైపు చూడటం లేదు.

మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఒక్కడు మాత్రమే ప్రచారం చేసుకుంటున్నాడు. అక్కడ ఫలితం ఎలా ఉంటుందో ముందే ఊహించుకుని కాంగ్రెస్ నాయకులు వెనకడగు వేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా.. అక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వాలంటూ పార్టీ అభ్యర్థికి సీనియర్లు అండగా నిలిచి.. ప్రచారం చేయాలని సొంత పార్టీ నేతలే సూచిస్తున్నారు. లేని పక్షంలో అక్కడ పార్టీకి డిపాజిట్లు కూడా కష్టమేనని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Also Read..

PM Narendra Modi: అలాంటి వారితో దేశానికి ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని మోదీ

Hyderabad News: పొంగి పొర్లిన మందు.. అమ్మాయిలతో చిందులు.. అంతలోనే ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..