Roja: ప్రత్యేకత చాటుకున్న నగరి ఎమ్మెల్యే రోజా.. సీఎం జగన్‌కు ప్రత్యేక శాలువాతో సత్కారం..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన క్రియేటివిటీని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ వెరైటీ శాలువాతో సన్మానించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన క్రియేటివిటీని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓ వెరైటీ శాలువాతో సన్మానించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రోజా ఏం చేశారంటే…
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు జగన్ సోమవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి చేరుకున్న సీఎంకు నగరి ఎమ్మెల్యే, స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రోజా సీఎం జగన్‌ను సన్మానించారు. జగన్, వైఎస్ఆర్ చిత్రాలతో కూడిన పట్టు శాలువాతో ముఖ్యమంత్రిని సత్కరించి రోజా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ఈ శాలువాను దగ్గరుండి స్వయంగా తయారు చేయించారు.
సీఎం జగన్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాసేపట్లో సీఎం జగన్ రేణికుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకోనున్నారు.