AP Weather: ఉత్తర అండమాన్ ప్రాంతములలో అల్పపీడన అవకాశం, వచ్చే రెండు రోజులకు ఏపీకి వాతావరణ సూచన
ఉత్తర అండమాన్ సముద్రం.. పరిసర ప్రాంతాలలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది.
Andhra Pradesh Weather Report: ఉత్తర అండమాన్ సముద్రం.. పరిసర ప్రాంతాలలో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావము వలన రాగల 48 గంటలలో తూర్పుమధ్య బంగాళాఖాతం.. దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతములలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదలి దక్షిణ ఒడిషా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకొనే అవకాశం ఉంది.
ఒక తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి ఉత్తరఅండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణకోస్తా ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కర్ణాటక తీరాల మీదుగా తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతములో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుండి 4.5 కి.మీ ఎత్తులమధ్య కొనసాగుతోంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు:
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. మరియు ఈరోజు అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Read also: AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు