AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌లో ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం దసరాకు ముందే ఆసరా వారోత్సవాల పేరుతో పెద్ద పండుగ తెచ్చింది. మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు

AP CM Jagan Aasara: ఏపీలో ఆడపడుచులకు ఆసరా వారోత్సవాల పేరుతో మరో దసరా పండుగ తెచ్చిన జగన్ సర్కారు
Cm Jagan Aasara
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 12, 2021 | 4:01 PM

Aasara week in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం దసరాకు ముందే ఆసరా వారోత్సవాల పేరుతో పెద్ద పండుగ తెచ్చింది. మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిస్తూ వారికి వైఎస్ఆర్‌ ఆసరా పేరుతో ఆర్ధిక తోడ్పాడు అందిస్తోంది. మహిళాలోకం తలెత్తుకునేలా చేస్తున్న సీఎం జగన్‌కి నగర, పట్టణ, గ్రామాల్లో ఆడపడుచులు అభిమానం కురిపిస్తున్నారు. సీఎం ఫోటోలకు పాలాభిషేకం చేస్తున్నారు.

ఆసర వారోత్సవాల పేరుతో ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 7నుంచి ఆసరా చెక్కులను అందజేస్తోంది. ఈపండుగలో లబ్ధి పొందిన వాళ్లే కాదు…మహిళామణులు, అక్కచెల్లెళ్లు జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మహిళలకు చెక్కులు అందజేశారు.

మహిళలకు నాలుగు విడతల్లో చెల్లిస్తామని మాటిచ్చిన జగన్‌ సర్కారు చెప్పినట్లుగా రెండో విడత చెక్కుల్ని అందజేస్తూ ఊరూరా వారోత్సవాలు నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో ఆసరా రెండో విడత డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు. టీడీపీ వాళ్ళు మంచి పనులు చెయ్యలేదని, చేసే వారిని ఎలా అడ్డుకుందామా అని చూస్తున్నారన్నారని మండిపడ్డారు.

చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆసరా రెండో విడత పథకం చెక్కుల పంపిణి కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. చెక్కులు అందజేసేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే రోజాకు మహిళలు కోలాటాలు, నృత్యాలతో స్వాగతం పలికారు. మహిళలకు చెక్కులు అందజేసిన రోజా ….జన సంక్షేమమే…జగన్‌ అన్న ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మహిళలు.

రాష్ట్రంలో YSR ఆసర పథకాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అని కొనియాడారు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. అనకాపల్లి నియోజకవర్గంలో రెండో విడత చెక్కులను అందజేశారు. ఈకార్యక్రమానికి హాజరైన మహిళలు జగన్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు.

ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌ ఆసరా పథకం లబ్ధిదారులు సంబురాలు జరుపుకుంటున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మహిళ సంఘాలకు చెక్కులను అందజేశారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండో విడత ఆసరా చెక్కుల పంపిణి కార్యక్రమం ఓ పండుగల నిర్వహించింది ప్రభుత్వం. లబ్ధిదారులైన మహిళలకు, పొదుపు మహిళా సంఘాలకు కలెక్టర్‌ చెక్కులు అందజేశారు.

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో అక్కచెల్లెమ్మలకు ఆసరా చెక్కులను కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అందజేశారు. మహిళలకు ఆర్ధికంగా చేయూతనిస్తూ వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తేవాలన్నారు ప్రసన్నకుమార్‌రెడ్డి.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రెండో విడత వైయస్‌ఆర్‌ అసరా పథకం చెక్కులను అందజేశారు స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం. ఈకార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళలపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని జగన్‌కు కృతకజ్ఞతలు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో YSR ఆసరా పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఆడపడుచులకు చెక్కులు అందజేశారు పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. చెక్కుల పంపిణి అనంతరం సీఎం ఫోటోకు పాలాభిషేకం చేశారు మహిళలు.

రాష్ట్రంలో జగనన్న పరిపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉంటున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి, తాడేపల్లిలో YSR ఆసరా రెండవ విడత చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. 1280 గ్రూపుల్లోని 12259 మంది డ్వాక్రా మహిళలకు రెండో విడత 11 కోట్ల 13 లక్షల రూపాయల చెక్ లను పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు గ్రామాల్లో వైఎస్ఆర్‌ రెండో విడత ఆసరా కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. చాగల్లు మండలంలోని1235 స్వయం సహాయక సంఘాల గ్రూప్‌లకు 4విడతల్లో 40.61 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు. డ్వాక్రా గ్రూప్‌ మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా వారోత్సవాలు గత ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలోని స్వయం సహాయక మహిళా సంఘాలతో పాటు డ్వాక్రా గ్రూప్‌ పొదుపు సంఘాలకు చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి.

మహిళలు ముందడుగు వేస్తూ… ఆర్థికంగా స్థిరపడాలన్నది సీఎం జగన్ లక్ష్యమని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా ఆసరా పథకం కింద నగదు పొందుతున్న వారంతా సొంత కాళ్లపై నిలబడుతూ ఆర్ధికంగా బలపడుతున్నారని చెప్పారు.

దసరాకు ముందే అనంతపురం జిల్లా కదిరిలో ఆడపడుచులకు పండుగ కానుక అందించింది జగన్ ప్రభుత్వం.రెండో విడత YSR ఆసరా పథకం చెక్కులను అందజేశారు స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 78లక్షల మంది అక్కచెల్లమ్మల అకౌంట్లలో 6700 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో మహిళామణులకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆసరా చెక్కులను అందజేశారు. ఈనెల 7వ తేది నుంచి మొదలుపెట్టిన ఆసరా వారోత్సవాలను పది రోజుల పాటు కొనసాగిస్తోంది ప్రభుత్వం.

Read also: Mula Nakshatra: ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన