Mula Nakshatra: ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం

ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం తొణికిసలాడింది. ఇటు బాసర- అటు బెజవాడలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. బాసరలో అక్షరాభ్యాసాలు భారీగా

Mula Nakshatra:  ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం
Mulanakshatra
Follow us

|

Updated on: Oct 12, 2021 | 3:12 PM

Mula Nakshatra: ఏపీ, తెలంగాణ ఆలయాల్లో మూలానక్షత్ర వైభవం తొణికిసలాడింది. ఇటు బాసర- అటు బెజవాడలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. బాసరలో అక్షరాభ్యాసాలు భారీగా జరిగాయి.. బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీ అలంకారంలో దర్శనమిచ్చింది. దీంతో భక్త జన సందోహం పోటెత్తింది.

మూలనక్షత్ర శోభతో బాసర సరస్వతీ ఆలయం శోభిల్లింది. మూలా నక్షత్రం సరస్వతీ దేవి జన్మనక్షత్రం కావడంతో భారీగా పోటెత్తారు భక్త జనం. ఉదయం మూడు గంటలకే అమ్మవారి కృపాకటాక్షాల కోసం బారులు తీరారు. శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. కాత్యాయనీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారు. ఉదయం 11 గంటలకు మూలా నక్షత్ర పూజ జరిగింది.. పదకొండు గంటల తర్వాత అష్టమి రావడంతో.. ముందుగానే పూజలను ముగించారు అర్చకులు.

బాసర అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రభుత్వం తరుపున బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ మంత్రి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రి.. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.

ఈ రోజు మూల నక్షత్రం కావడం.. ఇది అమ్మవారి జన్మనక్షత్రం అవడంతో.. బాసర ఆలయంలోని నాలుగు మండపాల్లో అక్షరాభ్యస కార్యక్రమాలు సాగాయి. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు భక్తులు.

ఇక బెజవాడ ఇంద్రకీలాద్రి పైనా మూలా నక్షత్ర శోభ వెల్లివిరుస్తోంది. సరస్వతీ అలంకారంలో భాసిల్లుతోన్న అమ్మవారిని దర్శించుకోడానికి భారీ ఎత్తున బారులు తీరారు.. భక్త జనులు. అమ్మవారి విద్యా కటాక్షం పొందడానికై రాత్రి నుంచే క్యూ లైన్ లో నిలుచున్నారు. జన్మనక్షత్ర సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు..

ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తులాభారం ఇచ్చిన ఏపీ సీఎం జగన్.. మధ్యామ్నం బెజవాడ దుర్గమ్మ సందర్శనానికై వచ్చారు. సరస్వతీ అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ చేశారు.

Read also: National Politics: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌..!