Liger: అక్కడ ‘పుష్ప’ రికార్డును బ్రేక్ చేసిన విజయ్ ‘లైగర్’.. ఎలా అంటే

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ మూవీ లైగర్(Liger). రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.

Liger: అక్కడ 'పుష్ప' రికార్డును బ్రేక్ చేసిన విజయ్ 'లైగర్'.. ఎలా అంటే
Liger
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 27, 2022 | 3:16 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ మూవీ లైగర్(Liger). రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ ఓపినింగ్స్ వచ్చాయి. విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విజయ్ కు తల్లిగా నటించింది. ఇక లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. బాలీవుడ్ లో లైగర్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

తాజాగా ఈ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాను బీట్ చేసింది. తొలి రోజు కలెక్షన్స్ లో పుష్ప సినిమాను బీట్ చేసింది లైగర్. అల్లు అర్జున్ పుష్ప సినిమా బాలీవుడ్ లో తొలిరోజు 3 కోట్ల వరకు వసూల్ చేసింది. అయితే లైగర్ సినిమా బాలీవుడ్ లో 4.7 కోట్లు వాసుల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రెండో రోజు కూడా బాగానే రాబట్టింది తెలుస్తోంది. లైగర్ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్- పూరి ల నెక్స్ట్ మూవీ ‘జన గణ మన’ కి కూడా అక్కడ భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.