Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Movie Review: ‘లియో’ సినిమా రివ్యూ.. ఇళయదళపతి, లోకేష్ యాక్షన్ డ్రామా మళ్లీ వర్కవుట్ అయ్యిందా ?..

లోకేష్ కనకరాజ్ సినిమాలన్నీ ఒక యూనివర్స్‌లో నడుస్తున్నాయి. ఒక కథతో మరోదానికి లింక్ పెడుతూ స్టోరీస్ రాసుకుంటున్నాడు లోకేష్. అందుకే LCU క్రియేట్ చేసాడీయన. అందులో భాగంగానే మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లియో కూడా అందులో భాగమే. దీన్ని కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించాడు లోకేష్. ముఖ్యంగా ఖైదీతో పాటు విక్రమ్ ఛాయలు ఇందులోనూ బానే చూపించాడు లోకేష్. ఆ సినిమాలు చూసిన వాళ్లకు లియో ఇంకా బాగా ఎక్కేస్తుంది.

Leo Movie Review: 'లియో' సినిమా రివ్యూ.. ఇళయదళపతి, లోకేష్ యాక్షన్ డ్రామా మళ్లీ వర్కవుట్ అయ్యిందా ?..
Leo Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Oct 19, 2023 | 6:00 PM

మూవీ రివ్యూ: లియో

నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జ, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు

సంగీతం: అనిరుధ్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్: ఫిలోమాన్ రాజ్

నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ ఫళనిస్వామి (తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్)

రచన, దర్శకుడు: లోకేష్ కనకరాజ్

లియో.. కొన్ని రోజులుగా కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా. ఏకంగా జైలర్‌ను కూడా బీట్ చేస్తుందనే అంచనాలతో ఈ సినిమా వచ్చింది. పైగా విజయ్ ట్రాక్ రికార్డ్, లోకేష్ కనకరాజ్ బ్రాండ్ లియోపై అంచనాలు మరింత పెరిగాయి. మరి వాటిని ఈ సినిమా అందుకుందా లేదా చూద్దాం..

కథ:

పార్తీబన్ (విజయ్) తన కుటుంబంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని థియోగ్‌లో కాఫీ షాప్ పెట్టుకుని ఉంటాడు. అక్కడే బతుకుతుంటాడు. ఆయనకు భార్య సత్య (త్రిష), కొడుకు, కూతురు ఉంటారు. హాయిగా సాగిపోతున్న పార్తీబన్ జీవితంలోకి అనుకోకుండా కొందరు వ్యక్తులు ఎంటర్ అవుతారు. తప్పనసరి పరిస్థితుల్లో వాళ్లను చంపేస్తాడు పార్తీ. ఆ తర్వాత వరసగా ఆయన్ని చంపడానికి మనుషులు వస్తూనే ఉంటారు. ఇలా సాగుతున్న పార్తీబన్ జీవితంలోకి ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హెరాల్డ్ దాస్ (అర్జున్) వస్తారు. 20 ఏళ్ళ కింద కనిపించకుండా పోయిన లియోను పోలి పార్తీబన్ ఉండటంతో.. అతడే ఇతను అంటూ ఆయన వెంట పడుతుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. నిజంగానే పార్తీబనే లియోనా లేదంటే ఇద్దరుంటారా అనేది అసలు కథ..

కథనం:

లోకేష్ కనకరాజ్ సినిమాలన్నీ ఒక యూనివర్స్‌లో నడుస్తున్నాయి. ఒక కథతో మరోదానికి లింక్ పెడుతూ స్టోరీస్ రాసుకుంటున్నాడు లోకేష్. అందుకే LCU క్రియేట్ చేసాడీయన. అందులో భాగంగానే మాస్టర్, ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు లియో కూడా అందులో భాగమే. దీన్ని కూడా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కించాడు లోకేష్. ముఖ్యంగా ఖైదీతో పాటు విక్రమ్ ఛాయలు ఇందులోనూ బానే చూపించాడు లోకేష్. ఆ సినిమాలు చూసిన వాళ్లకు లియో ఇంకా బాగా ఎక్కేస్తుంది. ముఖ్యంగా విజయ్ కారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేసాడు ఈ దర్శకుడు. కాకపోతే సింగిల్ పాయింట్‌పైనే సినిమా అంతా సాగడంతో కాస్త బోర్ ఫీల్ అయితే అవుతారు. ఫస్టాఫ్ మాత్రం ఎక్కడా ఆగకుండా రేసులో దూసుకుపోయింది. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్సులు నెక్ట్స్ లెవల్‌లో ప్లాన్ చేసాడు లోకేష్ కనకరాజ్. మరోసారి అందులో తన ప్రతిభ చూపించాడు ఈ దర్శకుడు. విజయ్ ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు హైనాతో ఫైట్ కూడా బాగానే డిజైన్ చేసారు. విజయ్, త్రిష మధ్య వచ్చే సీన్స్.. ఫ్యామిలీ సన్నివేశాలన్నీ బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్ స్టార్ట్ అయ్యాక లియో రేంజ్ మారిపోయింది. ఫస్టాఫ్ అదిరిపోయే రేంజ్‌లో ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్.. కీలకమైన సెకండాఫ్ మాత్రం వదిలేసాడు. ముఖ్యంగా సంజయ్ దత్, అర్జున్ వచ్చిన తర్వాత సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుందేమో అనుకుంటే.. అక్కడే కాస్త డౌన్ అయింది. సంజయ్, అర్జున్ కారెక్టర్స్‌పై కూడా ఇంకాస్త ఫోకస్ చేసుంటే లియో రేంజ్ మరింత పెరిగుండేది. కానీ హడావిడిగా వాళ్ల కారెక్టర్స్ ముగించేసినట్లు అనిపిస్తుంది. సినిమా అంతా సర్వైవల్ థ్రిల్లర్‌గా సాగిపోతుంది. లియో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది.

నటీనటులు:

విజయ్ మరోసారి అద్భుతంగా నటించాడు. ఈయన స్క్రీన్ ప్రజెన్స్‌లోనే ఏదో మాయ ఉంటుంది. ముఖ్యంగా సిగ్నేచర్ మూవెంట్స్‌తో ఫ్యాన్స్‌ను మాయ చేస్తుంటాడు విజయ్. ఇందులోనూ అదే చేసాడు. త్రిష కూడా తన పాత్రకు న్యాయం చేసింది. సంజయ్ దత్, అర్జున్ పాత్రలు ఈ సినిమాకు కీలకం. వాళ్లిద్దరూ కూడా అద్భుతంగా వాటికి న్యాయం చేసారు. గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ వాళ్ల వాళ్ల పాత్రల్లో ఒదిగిపోయారు.

టెక్నికల్ టీం:

అనిరుధ్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు ఓకే కానీ ఆర్ఆర్ అదిరిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే రీ రికార్డింగ్‌తో పైకి లేచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ మ్యూజిక్ హైలైట్. ఎడిటింగ్ ఓకే.. చాలా రేసీగా వెళ్లిపోయింది కూడా. కాకపోతే అక్కడక్కడా కొన్ని స్లో సీన్స్ ఇబ్బంది పెడతాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. మనోజ్ పరమహంస వర్క్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఆయన బ్రాండ్ అంతే. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఖైదీ, విక్రమ్‌తో పోలిస్తే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సారి కాస్త తక్కువగానే మాయ చేసాడు. ఫస్టాఫ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించిన ఈయన.. సెకండాఫ్‌లో కాస్త స్లో అయ్యాడు. క్లైమాక్స్ కూడా హెవీ యాక్షన్ ఎపిసోడ్ ఇబ్బందిగా అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అదిరిపోయాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా లియో.. స్టైలిష్ యాక్షన్ డ్రామా.. కండీషన్స్ అప్లై..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.