AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B Saroja Devi: సరోజా దేవి ఆఖరి కోరిక నెరవేరింది.. చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన దిగ్గజ నటి

అలనాటి అందాల తార, దిగ్గజ నటి బి. సరోజా దేవి (87) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె బెంగళూరులోని తన స్వగృహంలో సోమవారం (జులై14) తుదిశ్వా స విడిచారు. ఇవాళ సరోజా దేవి స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు పూర్తయినట్లు తెలుస్తోంది.

B Saroja Devi: సరోజా దేవి ఆఖరి కోరిక నెరవేరింది.. చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన దిగ్గజ నటి
Legendary Actress Saroja Devi
Basha Shek
|

Updated on: Jul 15, 2025 | 7:16 PM

Share

వెండితెరపై కొన్ని దశాబ్దాల పాటు తన నటనతో ప్రేక్షకులను అలరించారు దివంగత నటి సరోజా దేవి. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె సోమవారం కన్నుమూశారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని తన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. సరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె నటించిన సినిమాలు, సినీ కళామతల్లికి సేవలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక మంగళ వారం (జులై 15) సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నటిసరోజా దేవికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సరోజా దేవి ఆఖరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. నటి కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేశారు. ఐదేళ్ల క్రితమే నటి సరోజా దేవి నేత్రదానానికి నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కోరుకున్న విధంగానే ఆమె కళ్లను నారాయణ నేత్రాలయకు అందజేశారు. ఈ విషయాన్ని నారాయణ ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ ధ్రువీకరించారు.

సరోజా దేవి మరణం తర్వాత నారాయణ నేత్రాలయ సిబ్బంది నటి కార్నియాను తీసి భద్రపరచినట్లు తెలిపారు. త్వరలోనే ఆ కార్నియాను కంటి చూపు లేని వారికి అమర్చనున్నట్లు వెల్లడించారు. ఇలా చనిపోయిన తర్వాత కూడా ఇద్దరికి కంటి చూపు ప్రసాదించిన దిగ్గజ నటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

సరోజా దేవికి నివాళులు అర్పిస్తోన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య..

తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు సరోజా దేవి. తెలుగులో ఒక 25కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారామె. ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా అలరించారు సరోజా దేవి. ముఖ్యంగా ఆత్మ బలం సినిమాలో ఏఎన్నార్ తో కలిసి ఆమె చేసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ పాట ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..