Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికోసం రూ. 5 కోట్ల ఖర్చు చేయనున్నారట..
మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన సూపర్ స్టార్ ఆయా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీద ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన సూపర్ స్టార్ ఆయా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు మహేష్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. ఇక ఇప్పటికే దుబాయ్, గోవాలో షూటింగ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో స్పెయిన్‌కు వెళ్లనున్నారని తెలుస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. ఇక ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తోపాటు.. కావాల్సినంత కామెడీ కూడా ఉండనుందట. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచలనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు మహేష్.
ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. గతంలో మహేష్‌తో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్ ఈ సారి మహేష్‌లో యాక్షన్ యాంగిల్ ను చూపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు మహేష్. మహేశ్ – త్రివిక్రమ్ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ రూ. 5 కోట్ల ఖర్చుతో ఓ భారీ ఇంటి సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్‌లో సినిమాకు సంబంధించిన చాలా భాగం షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :