Puneeth Raj Kumar: తెలుగులో సినిమా చేయాలనుకున్న పునీత్ రాజ్ కుమార్.. ఆ హిట్ మూవీ ఛాన్స్ ఎలా మిస్సయ్యిందంటే..
కేవలం హీరోగానే కాకుండా.. ఆయన చేసే సామాజిక సేవలకు.. మంచి మనసుకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. పునీత్‌కు తెలుగులోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా.. టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ పునీత్ కుటుంబసభ్యులకు మంచి సాన్నిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయనను వెంటే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్స్ ఎంత ప్రయత్నించిన ఆయనను కాపాడుకోలేకపోయారు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పునీత్.. హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా.. ఆయన చేసే సామాజిక సేవలకు.. మంచి మనసుకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. పునీత్‌కు తెలుగులోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా.. టాలీవుడ్ స్టార్స్ అందరితోనూ పునీత్ కుటుంబసభ్యులకు మంచి సాన్నిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా అందరితో పునీత్ కు మంచి స్నేహబంధం ఉంది. తెలుగులోనూ అభిమానులను సంపాందించుకున్న పునీత్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఓ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందట. అది కూడా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా కావడం విశేషం. మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన గోలీమార్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో క్లైమాక్స్ సీన్ లో ప్రకాష్ రాజ్ వచ్చి ఫోన్లో హీరోతో కొన్ని డైలాగ్స్ చెప్పి వెళ్లిపోతాడు. ఆ పాత్రను మొదట పునీత్ తో చేయించాలని పూరి అనుకున్నాడట. అందుకు పునీత్ కూడా ఓకే చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత వరుస సినిమాల కారణంగా పునీత్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడట.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పునీత్ నటించిన చిత్రం అప్పు. ఈ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇదే సినిమాను తెలుగులో ఇడియట్ పేరుతో రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో పునీత్ తో తెలుగులో ఓ సినిమా చేయించాలనుకున్నాడట పూరి. డైరెక్ట్ మూవీ కాకుండా.. స్పెషల్ రోల్ అయినా చేయించాలనుకున్నాడట. అలా ఆలోచించిందే.. గోలీమార్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర. కానీ ఈ సినిమా ఛాన్స్ మిస్సయ్యారు పునీత్.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
