Sunisith: ఫస్ట్ ఒళ్లు కమిలేలా వాయగొట్టారు.. ఆ తర్వాత చేతిలో డబ్బులు పెట్టారు.. ఈ వీడియో చూశారా
యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేసే సునిశిత్ మీద మెగా ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. అతడితో ఉపాసనకు, రామ్ చరణ్‌కు క్షమాపణలు చెప్పించారు. సునిశిత్ మతిస్థిమితం సరిగా లేదని పరిశ్రమ ప్రముఖులతో పాటు చాలామంది చెబుతుంటారు.

ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడు శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్. దీంతో మా వదిన జోలికి వస్తావా అంటూ రప్పాడించారు చరణ్ ఫ్యాన్స్. సునిశిత్‌ను వాయగొట్టారు. ప్రజంట్ ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. తొలుత ఆవేశంతో సునిశిత్‌ను కొట్టిన చరణ్ ఫ్యాన్స్‌కు.. తర్వాత అతడి తింగరితనం చూసి జాలి వేసింది. దీంతో ఖర్చుల కోసం సునిశిత్‌కు కొంత డబ్బు ఇచ్చారు.
“ఆడవాళ్ల గురించి ఎప్పుడూ అలా మాట్లాడవద్దు. మొన్నటి వరకు సినిమా గురించి మాట్లాడినా నిన్ను ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఆడవాళ్ల జోలికి వెళ్లావ్ కాబట్టి దెబ్బలు పడ్డాయ్. ఇకపై రామ్ చరణ్ గారు, ఉపాసన గారే కాదు.. అసలు ఏ సెలబ్రిటీ గురించి అయినా తప్పుగా మాట్లాడొద్దు. హ్యాపీగా ఉండు.. హ్యాపీగా బతుకు.. ఎవరి పర్సనల్ విషయాల జోలికి వెళ్లకు’’ అంటూ చేతులో డబ్బులు పెట్టి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తనదే మిస్టేక్ అని ఒప్పుకున్నాడు సునిశిత్.
AT THE END, Nee Fans Anna @AlwaysRamCharan ❤️?? https://t.co/Cddf0wL3WE pic.twitter.com/LVOpalYYXM
— Raees (@RaeesHere_) May 14, 2023
ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు సునిశిత్. పలు హిట్ సినిమాలను తాను రిజెక్ట్ చేశానని.. పలువురు హీరోయిన్స్‌తో తనకు ఎఫైర్ ఉందంటూ కామెంట్స్ చేశాడు. చాలామంది హీరోలు, హీరోయిన్స్, దర్శకులు తనకు ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని టార్గెట్ చేసి.. ఆమె తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం చేశాడు. ఇంకేముంది ఆమె ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఈ శాక్రిఫైజింగ్ స్టార్ గతంలో ఊచలు లెక్కేట్టాడు. అయినా తన రూట్ మార్చుకోలేదు. ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ మధ్య నందమూరి ఫ్యాన్స్ కూడా ఓ కోటింగ్ ఇచ్చారు. తాజాగా మెగా ఫ్యాన్స్ ఒళ్లు కమిలేలా వాయగొట్టారు. మరి ఇతగాడు ఇప్పుడైనా తన ప్రవర్తన మార్చుకుంటాడే లేదో చూడాలి.
ఉపాసన గురించి తప్పుగా మాట్లాడిన సునిశిత్ ను చితకబాదిన రాంచరణ్ ఫ్యాన్స్ ???
Inko sari social media lo kanapadadu inka ??@AlwaysRamCharan pic.twitter.com/xaOKTna0M5
— CHE GUEVARA™ (@Karthik4PSPK) May 13, 2023
