Bandla Ganesh: ‘మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే… కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు’

బండ్ల ఈజ్ బ్యాక్. అవును పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు స్టార్ ప్రొడ్యూసర్. గత ఎన్నికల సమయంలో ఆయన ఎంత అగ్రెసీవ్‌ కాంగ్రెస్ పార్టీకి తరఫున ప్రచారం చేశారో అందరికీ తెలుసు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన రెట్టింపు జోష్‌తో కదనరంగంలోకి దూకేందకు సిద్దమైనట్లే కనిపిస్తుంది.

Bandla Ganesh: 'మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే... కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు'
Bandla Ganesh
Follow us

|

Updated on: May 15, 2023 | 11:39 AM

గతంలో కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసి.. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న బండ్ల గణేశ్.. మరోసారి పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం ఉంటుందని.. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా అని ప్రకటించారు. బానిసత్వంతో కాకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తానని వెల్లడించారు. ఇక కర్నాటకలో కాంగ్రెస్ విజయం ఆయన కొత్త జోష్‌ని ఇచ్చినట్లు ఉంది. తాజాగా బండ్ల వేసిన ట్వీట్ తెగ ట్రెండ్ అవుతుంది. ‘మీరు మా రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయిస్తే… కర్ణాటక ప్రజలు రాష్ట్రాన్ని ఖాళీ చేయించారు.!!’ అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు బండ్ల. 4 సంవత్సరాల క్రితం నాటి ఒక ‘క్రిమినల్ పరువు నష్టం’ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో, దాన్ని కారణంగా చూపిస్తూ ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించారు. దాన్నే ఉదహరిస్తూ బండ్ల ఈ ట్వీట్ చేశారు.

ఇక ఆదివారం మదర్స్ డే సందర్భంగా తన తల్లితో పాటు తెలంగాణ తల్లి సోనియా అని సంభోదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు బండ్ల. డీకే శివకుమార్‌ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన్ను సీఎం చేయాలని ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. ఇదంతా చూస్తుంటే బండ్ల మళ్లీ కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. అతి త్వరలో బండ్ల గణేశ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆయన సేవలను తెలంగాణ కాంగ్రెస్ ఎంత మేర వినియోగించుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.