Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి.. అసలు ఎవరీ బ్యూటీ.. ?

ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోహీరోయిన్లతో పాటు.. ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఐఎండీబీ విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో టాప్ లో ఉన్న ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Actress: అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి.. అసలు ఎవరీ బ్యూటీ.. ?
Alia, Rashmika, Nitanshi Go
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2024 | 4:34 PM

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో భాషతో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా హిట్టైతే చాలు వరుస ఆఫర్స్ అందుకుంటూ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు రష్మిక మందన్నా, అలియా భట్, దీపికా పదుకొణె.. ఈ ముద్దుగుమ్మలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదోక వార్త వీరి గురించి హల్చల్ చేస్తుంది. తాజాగా IMDB ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ ప్రకారం ఈ వారంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, దీపికా పదుకొణే వంటి స్టార్ హీరోహీరోయిన్లతో పాటు.. ఇప్పుడిప్పుడే నటిగా కెరీర్ ఆరంభించిన 16 ఏళ్ల అమ్మాయి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఐఎండీబీ విడుదల చేసిన జాబితా ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో టాప్ లో ఉన్న ఈ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ అమ్మాయి మరెవరో కాదు.. లపతా లేడీస్ సినిమాలో నటించిన 16 ఏళ్ల అమ్మాయి నితాన్సీ గోయల్. లతాపా లేడీస్ సినిమాలో మెయిన్ లీడ్ పాత్ర పోషించింది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన లపాటా లేడీస్ రైలు ప్రయాణంలో వారి జీవితాలను మార్చే ఇద్దరు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరి మధ్య జరిగే సంఘటనలను ఇందులో చూపించారు. కొన్ని ప్రాంతాల్లో కనీస అవసరాలు.. ప్రాథమిక విద్య అందని స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపడానికి పోరాడిన ఇద్దరు మహిళల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ఇందులో ఫుల్ కుమారీ పాత్రలో కనిపించిన నితాన్సీ గోయల్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఆమె అందాన్ని చూసి మంత్రముగ్దలవుతున్నారు నెటిజన్స్.

తన అమాయకమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లను మించిపోయింది. IMDb విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో ఉంది. లపాటా లేడీస్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నితాన్సీ గోయల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.