Vijay Deverakonda: పడిన ప్రతిసారీ బలంగా తిరిగొచ్చావు.. విజయ్ దేవరకొండపై తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..

. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు ఈ స్టార్ హీరో పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే విజయ్ కొత్త సినిమా అప్డేట్స్ కూడా రివీల్ చేశారు.

Vijay Deverakonda: పడిన ప్రతిసారీ బలంగా తిరిగొచ్చావు.. విజయ్ దేవరకొండపై తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: May 09, 2024 | 3:58 PM

నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట్లో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి వెండితెరపై సందడి చేశాడు. ఆ తర్వాత హీరోగా తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు ఈ స్టార్ హీరో పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే విజయ్ కొత్త సినిమా అప్డేట్స్ కూడా రివీల్ చేశారు.

ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అలాగే చిన్నప్పటి ఫోటోస్ షేర్ చేస్తూ తన అన్నయ్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా.. ఎలా జీవించాలి అన్నదానికి నువ్వు ప్రత్యేక్ష ఉదాహారణ. ధృడంగా ఉండడం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ, ఇంకా చాలా నీ నుంచి నేర్చుకున్నాను. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి ఎంతో బలంగా తిరిగి వచ్చావు” అంటూ విజయ్ దేవరకొండ గురించి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ వెంటనే గీతా గోవిందం వంటి సినిమాతో ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరయ్యాడు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన విజయ్.. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మరో రెండు చిత్రాలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.