- Telugu News Photo Gallery Cinema photos Ram Charan and Upasana Attend the Padma Vibhushan award ceremony in Delhi New Look Goes Viral telugu movie news
Ram Charan: గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ ఇలా ఉంటాడా..? ఐఏఎస్ లుక్ అదిరిపోయింది..
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి పొలిటికల్ నాయకుడిగా ఈ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. అలాగే ఈ చిత్రంలో ఐఏఎస్ పాత్రలోనూ కనిపించనున్నారు.
Updated on: May 09, 2024 | 3:23 PM

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మొదటిసారి పొలిటికల్ నాయకుడిగా ఈ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు.

అలాగే ఈ చిత్రంలో ఐఏఎస్ పాత్రలోనూ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజులుగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కానీ ఇందులో చరణ్ ఎలా కనిపిస్తాడు.. ? ఎలాంటి లుక్ ఉంటుందనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కానీ చరణ్ ఎక్కువగా క్యాజువల్ లుక్స్ లో కనిపిస్తున్నాడు.

తాజాగా పద్మ అవార్డుల కార్యక్రమం కోసం భార్య ఉపాసనతో కలిసి ఢిల్లీకి వెళ్లారు చరణ్. నిన్న సాయంత్రమే మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఢిల్లీకి చేరుకోగా.. ఈరోజు ఉదయం ఉపాసన, రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో కెమెరా కంట చిక్కాడు.

అందులో సింపుల్ జీన్స్ షర్ట్, క్యాజువల్ బ్లాక్ ప్యాంట్ ధరించారు. కళ్లకు నల్లటి కళ్ల అద్దాలు ధరించి.. హెయిర్ స్టైల్ తో రెగ్యులర్ ఫార్మెట్ లో కనిపిస్తున్నారు. ఇక క్లీన్ షేవ్ లో కనిపించాడు. మొత్తం చరణ్ లుక్ గమనిస్తే స్మార్ట్ లుక్ లో ఐఏఎస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఇలాగే కనిపిస్తాడా ? అంటూ చర్చలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. అంతేకాకుండా ఐఏఎస్ చరణ్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఇలాగే కనిపిస్తాడా ? అంటూ చర్చలు మొదలుపెట్టారు ఫ్యాన్స్. అంతేకాకుండా ఐఏఎస్ చరణ్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.




