Rajeev Rayala |
Updated on: May 09, 2024 | 2:16 PM
చాలా మంది హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె చాలా మంది హీరోల ఫెవరెట్ హీరోయిన్
అంతే కాదు ఈ చిన్నది చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫెవరెట్ హీరోయిన్, ఆయనతో కలిసి నటించింది కూడా.. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చిన్నది.
బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించింది అనుష్క. ప్రస్తుతం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ అందుకుంది అనుష్క శెట్టి.
ప్రస్తుతం అనుష్క ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ కంటెంట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమానుంచి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.