ఈ ఫోటోలోని చిన్నోడు అమ్మాయిలకు రాకుమారుడు.! ఓ ఇండస్ట్రీకి సూపర్‌స్టార్.. ఎవరో తెల్సా..
పైన ఫోటోలో బర్త్‌డే కేక్ తింటున్న పిల్లాడిని గుర్తుపట్టారా.? ఈ చిన్నోడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు అతడి కోసం అమ్మాయిలు పడి చస్తారనుకోండి. మనోడు బాలీవుడ్ స్టార్ హీరో. అయితేనేం.. అన్ని భాషల్లో ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంది. బీ-టౌన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.
పైన ఫోటోలో బర్త్‌డే కేక్ తింటున్న పిల్లాడిని గుర్తుపట్టారా.? ఈ చిన్నోడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు అతడి కోసం అమ్మాయిలు పడి చస్తారనుకోండి. మనోడు బాలీవుడ్ స్టార్ హీరో. అయితేనేం.. అన్ని భాషల్లో ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉంది. బీ-టౌన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.? మరెవరో కాదండీ.. హృతిక్ రోషన్. ఆరేళ్లకే బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోగా పరిచయమై.. హాలివుడ్ రేంజ్ కటౌట్‌తో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హృతిక్. టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో హృతిక్ రోషన్ మైనపు బొమ్మ ఉన్న సంగతి తెలిసిందే. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను హృతిక్ రోషన్ తన సొంతం చేసుకున్నాడు. కోయి మిల్ గయా, క్రిష్, ధూమ్ 2, జోధా అక్బర్, విక్రమ్ వేద, ఫైటర్, వార్ లాంటి చిత్రాలు హృతిక్ రోషన్ అద్భుత నటనకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 2000వ సంవత్సరంలో సుస్సానే ఖాన్‌ను వివాహమాడాడు హృతిక్ రోషన్. అయితే ఈ జంట నవంబర్ 2014లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు హృతిక్.
View this post on Instagram