Kumari Aunty: కుమారి ఆంటీ మాటలకు ఫిదా అయిన విజయ్ దేవరకొండ

యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను వీడియోలు తీసి సోషల్ పోస్ట్ పోస్ట్ చేశారు. అంటే జనాలు ఎగబడ్డారు.. దాంతో ఆమె అనుకోని చిక్కుల్లో కూడా పడింది. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె షాప్ ను తీసేయాలని చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించింది ఆమెను షాప్ కంటిన్యూ చేయమన్నారు. అంతే కాదు ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని కూడా మాటఇచ్చారు సీఎం.

Kumari Aunty: కుమారి ఆంటీ మాటలకు ఫిదా అయిన విజయ్ దేవరకొండ
Kumari Aunty
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 02, 2024 | 5:19 PM

కుమారి ఆంటీ.. మొన్నమధ్య విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్ నడుకుంటున్న కుమారి ఆంటీని ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ ను చేసింది. యూట్యూబర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను వీడియోలు తీసి సోషల్ పోస్ట్ పోస్ట్ చేశారు. అంటే జనాలు ఎగబడ్డారు.. దాంతో ఆమె అనుకోని చిక్కుల్లో కూడా పడింది. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని పోలీసులు ఆమె షాప్ ను తీసేయాలని చెప్పారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించింది ఆమెను షాప్ కంటిన్యూ చేయమన్నారు. అంతే కాదు ఆమె ఫుడ్ స్టాల్ కు వస్తానని కూడా మాటఇచ్చారు సీఎం. ఇదిలా ఉంటే ఇప్పుడు కుమారి ఆంటీ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. దాంతో పాటు ఆమె సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ గా మారిపోయారు.

ఇక కుమారి ఆంటీ ఈ క్రేజ్‌తో పలు టీవీ షోలతో పాటు సీరియల్స్ లోనూ నటించారు. తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ ఈవెంట్‌ను హైరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, చిరంజీవి పాల్గొన్నారు. అలాగే పలువురు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ కూడా పాల్గొన్నారు. అలాగే కుమారి ఆంటీ కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఆమె ఎమోషనల్ అయ్యారు.

కుమారీ ఆంటీ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఇది ఊహించలేదు.. అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని నన్ను ఇప్పుడు ఇంతమందిలోకి తీసుకు వచ్చింది సోషల్ మీడియా. నాకు సపోర్ట్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఆత్మవిశ్వాసం ఏదైనా సాధించవచ్చు.. చదువు లేదని ఎప్పుడూ బాధపడొద్దు.. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మనం ముందుకు సాగుతాం.. అని తెలిపారు కుమారీ ఆంటీ “చెరువులో చేపకెవరు ఈత నేర్పిరి..? బావిలోని కప్పకెవరు బాస నేర్పిరి? అడవిలోని హంసకెవరు ఆట నేర్పిరి.? ఆ చెట్టు మీద కోయలకెవరు కూత నేర్పిరి..? పుట్టలోని పాముకెవరు బుసలు నేర్పిరి? పుట్టిన బాలుడకెవరు ఏడ్పు నేర్పిరి..?’ అని మా అమ్మమ్మ, నాన్నమ్మ నాకు ధైర్యం చెప్పారు. చదువు ఒక్కటే కాదు.. పని తనం నేచుకుంటే.. మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుందని చెప్పారు. పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా విజయమే అని నా విషయంలో నిజమైంది  పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు”అని ఎమోషనల్ అయ్యారు కుమారీ ఆంటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.