KS CHITRA BIRTHDAY SPECIAL : ఆ స్వరాన్ని ఎవరైనా మరిచిపోగలరా..! ఇప్పటికి 25 వేల పాటలు పూర్తి చేసిన సంగీత సరస్వతి..
KS CHITRA BIRTHDAY SPECIAL : సింగర్ చిత్ర అంటే తెలియనివారుండరు. ప్రత్యేకమైన స్వరంతో తనదైన శైలిలో పాటలు పాడుతూ
KS CHITRA BIRTHDAY SPECIAL: సింగర్ చిత్ర అంటే తెలియనివారుండరు. ప్రత్యేకమైన స్వరంతో తనదైన శైలిలో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ద గ్రేట్ సింగర్ చిత్ర బర్త్ డే ఈ రోజు. ఆమె జూలై 27, 1963 న కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. చిత్ర కుటుంబం మొత్తం పాటలు పాడే సంప్రదాయం ఉంది. చిత్ర తండ్రి కృష్ణన్ నాయర్ ఆమెకు మొదటి గురువు. చిత్ర చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ప్రారంభించారు. తన మొదటి పాటను 1979 లో రికార్డ్ చేసింది. సినిమా ‘అట్టాసం’. ఈ చిత్రం 1983 లో విడుదలైంది.
చిత్ర స్వరం చాలా స్పెషల్ ఆమె స్వరాన్ని శ్రోతలు ఎప్పటికి మరిచిపోలేరు. ఒక్కసారి చిత్ర పాటను విన్నాక మీరు ఆ పాటను పూర్తిగా గుర్తుంచుకుంటారు. చిత్ర తన జీవితంలో ఏ గాయకుడు కానీ గాయకురాలిని కాపీ చేయలేదు. తనదైన శైలిలో సొంతంగా గుర్తింపు సాధించింది. అందుకే ఆమె గొంతు మిగతా సింగర్స్ కంటే భిన్నంగా ఉంటుంది. 80 వ దశకంలో ఆమె తెలుగులో అడుగుపెట్టారు. చిత్ర ఇప్పటివరకు 6 జాతీయ అవార్డులను సాధించింది. దీంతో పాటు ఒరియాతో సహా అస్సామీ, పంజాబీ, బెంగాలీ వంటి అనేక భాషలలో 25 వేలకు పైగా పాటలు పాడారు.అందుకే ఆమెను నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు.
సింగర్ చిత్ర ఇప్పుడు కొత్త పాట కోసం సిద్ధమవుతోంది.. కె.ఎస్ చిత్రకు ఒక అలవాటు ఉంది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆమె పాట పాడుతున్నా లేదా స్నేహితులతో మాట్లాడుతున్నా నవ్వుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచీ నా చిరునవ్వు నా గుర్తింపు అని ఆమె స్వయంగా చెబుతుంది. మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నవ్వుతున్నాను. తన స్మైల్ తన బలం అని చెప్పారు. అదే తనను ఇంతదూరం తీసుకువచ్చిందంటారు. ఎందుకంటే నవ్వుతున్న ముఖం ప్రజలను ఉత్సాహ పరుస్తుందంటారు చిత్ర.