Krithi Shetty: బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‏లో ఆసక్తికర కామెంట్స్ చేసిన బేబమ్మ.. ఆ సాంగ్ స్పెషల్ అంటూ

అక్కినేని నాగచైతన్య.. రమ్యకృష్ణ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగచైతన్య కృతి శెట్టి కీలక పాత్రలలో

Krithi Shetty: బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‏లో ఆసక్తికర కామెంట్స్ చేసిన బేబమ్మ.. ఆ సాంగ్ స్పెషల్ అంటూ
Krithi Shetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2022 | 10:13 AM

అక్కినేని నాగచైతన్య.. రమ్యకృష్ణ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగచైతన్య కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తుండగా.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఆదివారం బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కృతి శెట్టి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇటీవల విడుదలైన బంగార్రాజు పాటకు భారీ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే నా ఫస్ట్ డాన్స్ సాంగ్. ప్రేక్షకులిచ్చిన రెస్పాన్స్ వలన అది ఇంకాస్త స్పెషల్ అయిపోయిది. ఈ పాటను ఎంతో ఎనర్జీతో పాడిన మధుప్రియ గారికి థ్యాంక్యూ. భాస్కర్ గారు ఈ పాటను చాలా క్యాచీగా రాశారు. అందరికీ థ్యాంక్యూ. నా ఫస్ట్ డ్యాన్స్ నెంబర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారికి కృతజ్ఞతలు. బంగార్రాజు ఆల్బమ్ వింటే మాకు వాసి వాడి తస్సాదియ్యా చెప్పాలనిపిస్తోంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారనేది తెలుసుదు. నాగార్జున, రమ్యకృష్ణ లాంటి సీనియర్స్ యాక్టర్లతో పనిచేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అందరికీ థ్యాంక్ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Bangarraju: జ‌న‌వ‌రి 14.. అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి చాలా ముఖ్య‌మైన రోజు.. నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..

Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బ‌న్నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన అర్జున్ క‌పూర్..