Manchu Lakshmi: పుష్ప సినిమాను వీక్షించిన మంచువారమ్మాయి.. బన్నీ, రష్మిక, సామ్ ల గురించి ఏం చెప్పిందంటే..

ఐకానిక్ స్టార్  అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప'. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ లో కనిపించి

Manchu Lakshmi: పుష్ప సినిమాను వీక్షించిన మంచువారమ్మాయి.. బన్నీ, రష్మిక, సామ్ ల గురించి ఏం చెప్పిందంటే..
Manchu Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2022 | 10:04 AM

ఐకానిక్ స్టార్  అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ లో కనిపించి సందడి చేసింది. అనసూయ, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 17 న విడుదలై  భారీ  విజయం సాధించింది ‘పుష్ప’ సినిమా. కాగా ఈ సినిమాలో ‘పుష్పరాజ్’ అనే పాత్రలో నటించాడు బన్నీ.  ఊరమాస్ తో సాగే అతని పాత్ర అభిమానులతో పాటు పలువురి ప్రముఖుల  ప్రశంసలు కూడా పొందింది.  కాగా  థియేటర్లతో పాటు ప్రస్తుతం ఓటీటీ ప్రియులను అలరిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నటి, యాంకర్  మంచు లక్ష్మివీక్షించింది. ఈ సందర్భంగా సినిమాతో పాటు అందులోని నటీనటులపై సోషల్ మీడియా వేదికగాతన అభిప్రాయాలను వెల్లడించింది.

‘పుష్ప సినిమా  ఫెంటాస్టిక్ గా ఉంది. అల్లు అర్జున్ కి హ్యాట్సాఫ్. పుష్ఫ రాజ్ లాంటి పాత్రను చేయడం ఎంతో కష్టం. కానీ బన్నీ అద్భుతంగా చేశాడు.  సినిమాపై నీకున్న ప్రేమ, అంకిత భావం కారణంగానే పుష్ఫ చిత్రం ఇంత బాగా వచ్చింది. ఇక రష్మిక తన నటనతో  కేక పెట్టించింది. సమంత స్పెషల్ సాంగ్ అయితే  అదిరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. పుష్ప పార్ట్ 2 కోసంఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని వరుస ట్వీట్లలో చెప్పకొచ్చింది మంచువారమ్మాయి.

కాగా ఇటీవలే మంచు లక్ష్మికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్  ఐసోలేషన్ లో ఉంటోన్న ఆమె సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ సరదాగా సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే పుష్ప చూసి సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించింది మంచు లక్ష్మి.

Also Read:

Samantha: మళ్లీ అలాంటి పాత్రలో మెప్పించనున్న సామ్.. ఈసారి మరింత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో..

Sanjana Galrani: శుభవార్త చెప్పిన బుజ్జిగాడు హీరోయిన్.. త్వరలోనే తల్లి కాబోతున్న శాండల్ వుడ్ హీరోయిన్..

Silver Price Today: దేశంలో స్థిరంగా వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఎలా ఉన్నాయంటే..