Koratala Shiva: కీలక నిర్ణయం తీసుకున్న కొరటాల శివ.. ‘మీడియం మారింది కానీ బంధంలో మార్పు’ లేదంటూ..
Koratala Shiva: టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కొరటాల ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో అపజయం అంటూ ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో...
Koratala Shiva: టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కొరటాల ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో అపజయం అంటూ ఎరగని అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల ఒకరు. ఇక సినిమాలతో బిజీగా ఉండే కొరటాల అడపాదడపా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమా అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకునే కొరటాల తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై సోషల్ మీడియాకు పూర్తిగా దూరం కానున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కొరటాల ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాను సోషల్ మీడియాను ఎందుకు వీడుతున్నాను అన్న దానిపై మాత్రం దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతన్నట్లు ప్రకటించిన కొరటాల.. ‘నా సినిమాలు, నాకు సంబంధించిన విషయాలను ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాను. కానీ ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. అయితే మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటా. మీడియం మారింది కానీ మన మధ్య బంధంలో ఎలాంటి మార్పు ఉండదు’ అంటూ ఓ ప్రకటన చేశారు కొరటాల. ఇక సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
కొరటాల చేసిన ట్వీట్..
— koratala siva (@sivakoratala) June 25, 2021
Also Read: MAA elections 2021: ‘మా’ ఎన్నికల్లో ఎవరి మద్దతు ఎవరివైపు.. ఓ లుక్కేద్దాం పదండి