AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ధ‌నుష్‌.. కొత్త స్ట్రాట‌జీ ఫాలో అవుతోన్న త‌మిళ హీరోలు..

Dhanush Telugu Movie: ప్ర‌స్తుతం భాష‌ల మ‌ధ్య గీత‌లు చెరిగిపోతున్నాయి. ఒక భాష‌లో విడుద‌లైన చిత్రాల‌ను ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. వీటికే పాన్ ఇండియా చిత్రాలు అనే పేరు పెట్టారు. ఒక ఇండ‌స్ట్రీకి...

Dhanush: మ‌రో తెలుగు డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ధ‌నుష్‌.. కొత్త స్ట్రాట‌జీ ఫాలో అవుతోన్న త‌మిళ హీరోలు..
Dhanush Withtelugu Director
Narender Vaitla
|

Updated on: Jun 25, 2021 | 7:51 PM

Share

Dhanush Telugu Movie: ప్ర‌స్తుతం భాష‌ల మ‌ధ్య గీత‌లు చెరిగిపోతున్నాయి. ఒక భాష‌లో విడుద‌లైన చిత్రాల‌ను ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. వీటికే పాన్ ఇండియా చిత్రాలు అనే పేరు పెట్టారు. ఒక ఇండ‌స్ట్రీకి చెందిన హీరోలు మ‌రో ఇండ‌స్ట్రీ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేసే కొత్త ట్రెండ్ ఇటీవల ఎక్కువుతోంది. ఈ క్రమంలోనే త‌మిళ హీరోలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. వైవిధ్య భ‌రిత‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో ధ‌నుష్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌తో చేతులు కలిపిన ధ‌నుష్‌ ఓ త్రిభాష చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌తో ముడిప‌డిన య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిస్తున్నరాన్న‌వార్త‌ల నేప‌థ్య‌లో ఈ సినిమాపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాక‌ముందే ధ‌నుష్ మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడికి గ్రీన్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌కు ఫిదా అయిన ధ‌నుష్ వెంట‌నే సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని స‌మాచారం. అంతేకాకుండా తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన ఓ బ‌డా నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజ‌య్ కూడా తెలుగులో వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇలా త‌మిళ హీరోలు తెలుగు ద‌ర్శ‌కుల‌తో చేతులు క‌లుపుతూ స‌రికొత్త స్ట్రాట‌జీ ఫాలో అవుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Also Read: Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ ఆస్తుల విలువ ఎంత విలువో తెలిస్తే షాక్..

Allu Arjun: మ‌రో ప్ర‌యోగం చేయ‌నున్న అల్లు అర్జున్‌.. త‌న‌లోని కొత్త కోణాన్ని చూపించ‌నున్న‌ ఐకాన్ స్టార్‌.?

Manju Warrier: ఈమెను 90స్ హీరోయిన్ అంటే ఎవ‌రైనా న‌మ్ముతారా..? రూల్స్‌ను బ్రేక్ చేసి చూపిస్తున్న న‌టి