AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ ఆస్తుల విలువ ఎంత విలువో తెలిస్తే షాక్..

Kajal Aggarwal : గతంలో కంటే ఇప్పుడు హీరోలకంటే హీరోయిన్ల కెరీర్ తక్కువకాలమే. త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతారు. కాలక్రమంలో ఆ హీరోకే అక్కగా, అమ్మగా నటించిన సినిమాలు..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్ ఆస్తుల విలువ ఎంత విలువో తెలిస్తే షాక్..
Kajal
Surya Kala
|

Updated on: Jun 25, 2021 | 7:35 PM

Share

Kajal Aggarwal : గతంలో కంటే ఇప్పుడు హీరోలకంటే హీరోయిన్ల కెరీర్ తక్కువకాలమే. త్వరగా ఫెడ్ అవుట్ అయిపోతారు. కాలక్రమంలో ఆ హీరోకే అక్కగా, అమ్మగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం భాషతో సంబందం లేకుండా దశాబ్దకాలం పాటు హీరోయిన్ గా నటిస్తూ.. అలరిస్తున్నారు. అలాంటి హీరోయిన్ లో ఒకరుఅందాల చందమామ కాజల్ అగర్వాల్.  దక్షిణాదిలో సీనియర్ హీరోయిన్ల తో పాటు యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది.  అంతేకాదు ఇప్పటివరకూ ఈ హీరోయిన్ కు దక్కని అరుదైన రికార్డ్ ను సోత్నం చేసుకుంది .. మొదట రామ్ చరణ్ తో జోడీ కట్టిన కాజల్ తర్వాత తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 లో హీరోయిన్ గా నటించింది.

ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 35 ఏళ్ల కాజల్ 1985జూన్ 19న ముంబైలో జన్మించింది. వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ తల్లిదండ్రులు. కాజల్ కు నిషా అగర్వాల్ చెల్లెలు.. నిషా కూడా తెలుగు సినిమాల్లో నటించింది.. అక్కలా అవకాశాలు దక్కకపోవడంతో త్వరగానే పెళ్లి చేసుకుంది నిషా. కాజల్ మాస్ మీడియా స్పెషలైజేషన్ ఇన్ ఎడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ చేసింది.

అయితే కాజల్ కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం.. వ్యాపారం వైపు అడుగు వేయాలనుకున్న కాజల్  కాలేజీ డేస్ లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2004లో హిందీ మూవీ క్యూను హో గయానా తో వెండి తెరపై అడుగు పెట్టింది. తర్వాత 2007కి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వం లో తెరకెక్కిన లక్ష్మి కళ్యాణం మూవీలో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ సినిమాకు గాను చేసి,23లక్షల 50వేలు రెమ్యునరేషన్ తీసుకుంది. మగధీర సినిమాలో మిత్ర వింద గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చందమామ.

లక్షల రెమ్యునరేషన్ తో మొదలైన కాజల్ జర్నీ ఇప్పుడు కోట్లు తీసుకునే వరకూ చేరుకుంది. ఇటీవల మంచు విష్ణుతో నటించిన మోసగాళ్లు మూవీకి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంది. ముంబైలో దాదాపు 6కోట్ల రూపాయల విలువైన మెరైన్ డ్రైవ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. మూడు విలాసవంతమైన కార్లున్నాయి. మొత్తానికి మిత్రవింద సినిమాల ద్వారా రూ. 80 కోట్ల ఆస్తులను సంపాదించిదని ఫిల్మ్ నగర్ టాక్.. అయితే ఈ అందాల భామకు అందమైన మనసు కూడా ఉంది. ఎవరైనా కష్టంలో ఉన్నారు అని తెలిస్తే.. తనవంతు ఆర్ధిక సాయం అందిస్తుంది.. ఆపన్నలకు అండగా నిలబడుతుంది.

Also Read: 8వ తరగతి అర్హతKajal Aggarwal Net Worth 2021 Fiance, Car, Salary, Assetsతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే