AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : వాటే ట్విస్ట్.. బిగ్‏బాస్ హోస్ట్‏గా విజయ్ సేతుపతి.. ఇక రచ్చ రచ్చే..

ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈసారి ఎవరెవరూ పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది. ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనేదానిపై చర్చ నడుస్తుంది. కోలీవుడ్ బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఇన్నాళ్లు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు. ఇప్పుడు కమల్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్‏బాస్ రియాల్టీ షోకు హోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

Bigg Boss : వాటే ట్విస్ట్.. బిగ్‏బాస్ హోస్ట్‏గా విజయ్ సేతుపతి.. ఇక రచ్చ రచ్చే..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2024 | 3:13 PM

Share

బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాల్టీ షో బిగ్‏బాస్. ఎన్నో వివాదాలు.. విమర్శలు వచ్చినప్పటికీ ఈ షోకు రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్స్ కంప్లీట్ కాగా.. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై అప్పుడే చర్చ మొదలైంది. అసలు ఈసారి ఎవరెవరూ పాల్గొననున్నారనే ప్రచారం ఎక్కువగా నడుస్తుంది. ఈ క్రమంలో తమిళంలో మాత్రం హోస్ట్ ఎవరనేదానిపై చర్చ నడుస్తుంది. కోలీవుడ్ బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఇన్నాళ్లు కమల్ హాసన్ హోస్టింగ్ చేశారు. ఇప్పుడు కమల్ తప్పుకోవడంతో కోలీవుడ్ బిగ్‏బాస్ రియాల్టీ షోకు హోస్ట్ ఎవరనే విషయంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ్ బిగ్‏బాస్ హోస్ట్ గా కమల్ హాసన్ తప్పుకోవడంతో ఇప్పుడు ఎవరు వస్తారన్న ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. ఈ క్రమంలో కొత్త హోస్ట్ గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

అయితే ఈ షోకు హోస్ట్ గా కోలీవుడ్ హీరో శింబు వ్యవహరించనున్నారనే టాక్ వినిపించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో హీరో పేరు వినిపిస్తుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈసారి బిగ్‏బాస్ హోస్ట్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ్ విజయ్ సేతుపతిని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో ఆయన సన్ టీవీ ప్రముఖ షోలకు హోస్ట్ గా వ్యవహరించారు. మాస్టర్ చెఫ్ షోతోపాటు మరో కార్యక్రమానికి విజయ్ సేతుపతి హోస్టింగ్ చేశారు. దీంతో ఈసారి బిగ్‏బాస్ రియాల్టీ షోకు విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నారనే ప్రచారం గట్టిగానే వినిపిస్తుంది.

తమిళ్ బిగ్‏బాస్ సీజన్ 8 అక్టోబర్ నెలలో స్టార్ట్ కానుంది. త్వరలోనే కొత్త హోస్ట్ తో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు కమల్ హాసన్. అందుకే ఈ షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారతీయుడు 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు కమల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.