AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ వార్తలు.. స్పందించిన టీమ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు.

Jr. NTR: ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం అంటూ వార్తలు.. స్పందించిన టీమ్
Ntr
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2024 | 3:14 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తలతో అభిమానులై ఆందోళన చెందుతున్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం అని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు పుకార్లు పుట్టించారు కొందరు. దాంతో తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలను ఎన్టీఆర్ టీమ్ ఖండించింది. ‘జిమ్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం చిన్న గాయం అయ్యింది. అయినప్పటికీ తారక్ ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాన్ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది.

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.