AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiyaan Vikram: హీరో చియాన్ విక్రమ్ భార్య ఎవరో తెలుసా..? భర్త స్టార్ హీరో అయినా సింపుల్ లైఫ్..

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాదాపు 10 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుకన్నాడు. ఎలాంటి పాత్రలోనైనా జీవించే నటుడు చియాన్ విక్రమ్. అంతేకాకుండా సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే హీరో. విక్రమ్ నటనకు అడియన్స్, సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

Chiyaan Vikram: హీరో చియాన్ విక్రమ్ భార్య ఎవరో తెలుసా..? భర్త స్టార్ హీరో అయినా సింపుల్ లైఫ్..
Chiyaan Vikram
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2024 | 2:29 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. విభిన్నమైన చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. నటనపై ఆసక్తితో చిన్నవయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన విక్రమ్.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి డబ్ అయి భారీ విజయాన్ని అందుకున్నాయి. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాదాపు 10 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుకన్నాడు. ఎలాంటి పాత్రలోనైనా జీవించే నటుడు చియాన్ విక్రమ్. అంతేకాకుండా సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే హీరో. విక్రమ్ నటనకు అడియన్స్, సినీ విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

తొలిదశలో సరైన సినిమా అవకాశం రాక పరాజయాలతో సతమతమవుతున్న విక్రమ్‌కి ‘సేతు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ మూవీ ఘనవిజయం తర్వాత తమిళ చిత్రసీమలో విక్రమ్‌కు స్థానం ఏర్పడింది. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ అందుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విక్రమ్ తనదైన కథాంశాన్ని ఎంచుకుని అందులో అగ్రస్థానానికి చేరుకుంటున్నాడు. ఇక విక్రమ్ ఫ్యామిలీ గురించి జనాలకు అంతగా తెలియదు. అలాగే తన భార్యను కూడా ఎక్కువగా సినిమా ఈవెంట్లకు తీసుకురాడు. విక్రమ్ 1980వ దశకం చివరిలో శైలజా బాలకృష్ణన్‌ను కలుసుకున్నాడు. కొన్నాళ్లపాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారింది. 1992లో గురువాయూర్ ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం చెన్నైలోని లయోలా కాలేజీలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. విక్రమ్ భార్య శైలజ చెన్నైలోని ఒక పెద్ద పాఠశాలలో సైకాలజీ టీచర్‌గా పనిచేస్తున్నారు.

Vikram Chiyaan

Vikram Chiyaan

విక్రమ్‌, శైలజ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు ధృవ్ తమిళ చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేశారు. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. ఇక విక్రమ్ కూతురు అక్షిత వివాహం దివంగత రాజకీయ నాయకుడు కరుణానిధి మనవడు మను రంజిత్ ను వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్ చియాన్ తంగలాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.