AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: కొత్త సినిమా స్టార్ట్ చేసిన వెంకీమామ.. నయా లుక్ అదిరింది.. డైరెక్టర్ ఎవరంటే..

ఇందులో వెంకటేశ్ హీరోగా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్ల తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Venkatesh: కొత్త సినిమా స్టార్ట్ చేసిన వెంకీమామ.. నయా లుక్ అదిరింది.. డైరెక్టర్ ఎవరంటే..
Venkatesh
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2024 | 1:53 PM

Share

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సైంధవ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన సైంధవ్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా టార్గెట్ పెట్టుకుని తన నెక్ట్స్ మూవీ రెడీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేశ్ హీరోగా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్ల తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. వెంకటేశ్, అనిల్ రావిపూడి మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ వెంకీమామ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు అంటూ ప్రకటించారు మేకర్స్. ఈ మేకింగ్ వీడియోలో వెంకటేశ్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. లుంగీ, పంచ కట్టి సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో మరోసారి తనదైన కామెడీ టైమింగ్ తో అలరించనున్నారు వెంకటేశ్. ప్రస్తుతం ఈ సినిమా మేకింగ్ వీడియో నెట్టింట వైరలవుతుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో ఇదివరకు వచ్చిన ఎఫ్ 2, 3 చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇందులో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా కీలకపాత్రలలో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత వెంకీమామ, అనిల్ రావిపూడి కాంబోలో మరో కామెడీ యాక్షన్ డ్రామా రాబోతుండడంతో ఈ సినమాపై మంచి బజ్ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా