75 ఏళ్ల వృద్ధుడితో నిశ్చితార్థం.. భర్త రాకతో బయటపడ్డ నిజం! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఉదంతంలో కీలక మలుపు తిరిగింది. 75 ఏళ్ల వృద్ధుడు రామ్‌సుగ్గర్‌తో మహిళా సోషల్ మీడియా బ్లాగర్ రీనా రాజ్‌పుత్ నిశ్చితార్థం, హల్దీ వేడుకలు జరిగాయంటూ వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వైరల్ వీడియోలను చూసి ఆమె అసలు భర్త తిరిగి ఇంటికి రావడంతో, ఆమె తన భర్తతోనే మళ్లీ వివాహం చేసుకున్నట్లు కొత్త వీడియోలను విడుదల చేసింది. వృద్ధుడితో వివాహం గురించి వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని, తన పిల్లలు, భర్తతో సంతోషంగా ఉన్నానని ఆమె తేల్చిచెప్పింది.

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడానికి, వ్యూస్ కోసం కొందరు చేసే వింత చేష్టలు తరచూ వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసిన ఒక సంఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం 75 ఏళ్ల వృద్ధుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వీడియోలు పోస్ట్ చేసిన మహిళా బ్లాగర్ రీనా రాజ్‌పుత్ అలియాస్ రాణి, ఇప్పుడు అసలు నిజం బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ వివాహం కేవలం వీడియోల కోసమే చేసిన ఒక డ్రామా అని, తాను తన భర్తతోనే మళ్లీ పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించింది.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన 75 ఏళ్ల రామ్‌సుగ్గర్ అనే వృద్ధుడితో, మహిళా బ్లాగర్ రీనా రాజ్‌పుత్‌కు నిశ్చితార్థం హల్దీ వేడుకలు జరిగినట్లు కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. రామ్‌సుగ్గర్ కుమార్తె రాధ సోషల్ మీడియా కోసం వీడియోలు చేస్తుండగా, ఈ క్రమంలో రీనా పరిచయమైందని, ఆ తర్వాత వారి మధ్య ప్రేమ ఏర్పడి వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్త ఇంటర్నెట్‌లో క్షణాల వ్యవధిలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు.
View this post on Instagram
భర్త రాకతో బయటపడ్డ నిజం
తాజాగా రీనా రాజ్‌పుత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా మరో వీడియోను షేర్ చేసి అన్ని వదంతులకు తెరదించింది. ఆ వైరల్ వీడియోలను చూసి ఆమె అసలు భర్త తిరిగి ఇంటికి వచ్చాడని, దీంతో వారి మధ్య వివాదం చెలరేగిందని తెలిపింది. తన భర్త మళ్లీ తనను వివాహం చేసుకున్నాడని చెబుతూ, భర్త మెడలో పూలమాల వేసుకున్న, నుదుట సిందూర్ దిద్దుకుంటున్న ఫోటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేసింది.
వృద్ధుడి పెళ్లి కేవలం వీడియోల కోసమే!
75 ఏళ్ల వృద్ధుడితో పెళ్లిపై స్పందిస్తూ.. అవన్నీ కేవలం సోషల్ మీడియా కోసం సృష్టించిన డ్రామాలు మాత్రమేనని రీనా తేల్చిచెప్పింది. తనకు చిన్న పిల్లలు ఉన్నారని, తనకు ఇప్పటికే భర్త ఉన్నాడని చెబుతూ.. ఆ వృద్ధుడితో నిజమైన పెళ్లి ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేసింది. వృద్ధుడి కూతురు రాధ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడింది. కేవలం వ్యూస్, కంటెంట్ కోసం ఇవన్నీ చేశామని, ఇప్పుడు తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నానని రీనా పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, సోషల్ మీడియా క్రేజ్ కోసం సామాజిక మాధ్యమాల్లో జరిగే ఇలాంటి నాటకాలు ప్రస్తుతం నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.




