AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు జుంకాను తయారు చేసిన జ్యువెలర్.. రెండు గిన్నిస్ రికార్డులు కైవసం!

దుబాయ్‌కి చెందిన ప్రసిద్ధ జ్యువెలరీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత బరువైన, పెద్దదైన బంగారు జుంకాను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించడానికి 55 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు సుమారు 5,840 గంటల పాటు శ్రమించారు. భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన నెమలి రూపంలో రూపొందించిన ఈ మహాద్భుత జుంకాకు రెండు గిన్నిస్ రికార్డులు దక్కడంతో ఇది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు జుంకాను తయారు చేసిన జ్యువెలర్.. రెండు గిన్నిస్ రికార్డులు కైవసం!
Worlds Largest Gold Earring
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2026 | 7:17 AM

Share

ప్రపంచంలో అద్భుతమైన డిజైన్లు, సరికొత్త రికార్డులకు నిలయంగా ఉన్న దుబాయ్ మరో అరుదైన ఘనతను సాధించింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్దదైన బంగారు జుంకాను రూపొందించి చరిత్ర సృష్టించింది. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ భారీ స్వర్ణ ఆభరణం రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అద్భుత కళాఖండానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మయూర్ సహస్ర విశేషాలు

మయూర్ సహస్ర అంటే ఒక వేయి నెమళ్లు అని పేరు పెట్టిన ఈ అద్భుతమైన జుంకాను పూర్తిగా 22 కేరట్ల బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు దాదాపు 16.514 కిలోగ్రాములుగా ఉంది. అక్టోబర్ 24న దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లోని జ్వెల్ ఆఫ్ జాయ్ బై జాయ్‌లుక్కాస్ అనే మధ్యప్రాచ్యా అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్‌లో ఈ మహాద్భుత జుంకాను అధికారికంగా ప్రదర్శించారు. ఈ జుంకా పొడవు 1.215 మీటర్లు కాగా, దీని వ్యాసం 0.682 మీటర్లు ఉండటం విశేషం.

55 మంది కళాకారుల శ్రమ

ఇంతటి భారీ, అరుదైన ఆభరాన్ని తయారు చేయడం సాధారణ విషయం కాదు. దీని వెనుక దాదాపు 55 మంది నిపుణులైన స్వర్ణకార కళాకారుల అంకితభావం ఉంది. ఈ జుంకా తయారీకి వారు ఏకధాటిగా శ్రమించి మొత్తం 5,840 గంటల పాటు పనిచేశారు. యూఏఈలోని ఓ ప్రముఖ సంస్థ తమ వ్యాపార ప్రయాణానికి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, దుబాయ్ నగర అభివృద్ధికి గుర్తింపుగా ఈ సరికొత్త రికార్డును బహుమతిగా ఇవ్వాలని భావించి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.

ఇవి కూడా చదవండి

world’s largest gold earring

భారతీయ సంస్కృతికి ప్రతీక

భారతీయ సంస్కృతిలో నెమలి అనేది అందం, గర్వం, శాంతికి ప్రతీకగా నిలుస్తుంది. పురాణాల ఆధారంగా వెయ్యి నెమలి ఈకల స్ఫూర్తితో ఈ డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక న్యాయనిర్ణేతలు పాల్గొని, సదరు వ్యాపార గ్రూప్ చైర్మన్, సీఈఓ లకు రికార్డు ధృవీకరణ పత్రాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆభరణ ప్రియులను, కళాభిమానులను ఈ అరుదైన బంగారు జుంకా ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us