Dhanush: 2031 ఎన్నికలే టార్గెట్.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై కోలీవుడ్ రచ్చ
రాజకీయాలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. వారం క్రితం ఢిల్లీలో హీరో ధనుష్ చర్చలు జరిపారు. 58 జిల్లాల నుంచి 2,500 మందికి పైగా మహిళా అభిమానులతో ధనుష్ మీటింగ్ పెట్టారు. త్వరలోనే ధనుష్ రాజకీయ ఆరంగేట్రం ఉంటుందన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. 2031 ఎన్నికలే టార్గెట్‌గా స్కెచ్ వేస్తున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్‌కు తిరుగులేదు. వెండితెరపై స్టార్‌డమ్‌ను ఓటు బ్యాంకుగా మార్చుకున్న నేతల చరిత్ర అక్కడ ఉంది. అదే బాటలో విజయ్ సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్పుడు ధనుష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై బజ్ పెరుగుతోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే.. అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న చర్చ మొదలైంది. వారం క్రితం ఢిల్లీలో చర్చలు జరిపిన ధనుష్.. లెటెస్ట్‌గా చెన్నైలో మహిళా అభిమాన సంఘ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చోళింగనల్లూరులోని జేబీఆర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి 58 జిల్లాల నుంచి 2,500 మందికి పైగా మహిళా అభిమానులు హాజరయ్యారు. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్‌తో భారీ సంఖ్యలో అభిమానులను సమీకరించడం.. జిల్లాలవారీగా సంఘాలను యాక్టివ్ చేయడం.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ధనుష్ రాజకీయ ఆరంగేట్రం ఉంటుందన్న ప్రచారం ఊహందుకుంది. 2031 ఎన్నికలకు ఐదేళ్ల ముందే పొలిటికల్ స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అభిమాన సంఘాలను పునాదిగా మార్చుకున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి.. ఆ తర్వాత పార్టీ పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ధనుష్ అభిమాన సంఘాలు సైతం సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఐదేళ్ల ముందుగానే జిల్లాలవారీగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి.. ఫ్యాన్ బేస్‌ను పొలిటికల్ బేస్‌గా మార్చుకునేందుకు స్కెచ్ వేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే రాజకీయ ఆరంగేట్రంపై ధనుష్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇంకా రూమర్ స్టేజ్‌లోనే ఉంది. కానీ పొలిటికల్ పంచ్‌లు మాత్రం అప్పుడే పడుతున్నాయి. ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే సంచలన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తామని, కానీ తమ అధినేత విజయ్‌లా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సీఎం కావడం అసాధ్యమంటోంది. DMK సైతాన్ పోయిందని.. ఇప్పుడు పిల్ల సైతాన్లు వస్తున్నారంటూ సెటైర్లు వేశారు TVK మంత్రి అధవ్ అర్జున్. ప్రస్తుతానికి ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానుల హడావుడి తప్ప దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అధికారికంగా ధనుష్ ఎక్కడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పలేదు. మరి కేవలం ఊహాగానాలకే టీవీకే నుంచి ఆరేంజ్ రియాక్షన్ వచ్చిదంటే, రియల్‌గానే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందోనన్న ఆసక్తికర చర్చ తిమిళనాడు వ్యాప్తంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే మరో హీరో శివ కార్తికేయన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
