AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ 50వ ఎపిసోడ్: ట్విస్ట్‌లతో సాగిన డబుల్ ఎలిమినేషన్.. హౌస్‌లో తగ్గిన లవ్ ట్రాక్స్.!

బిగ్ బాస్ హౌస్ ఎప్పుడూ రకరకాల ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా సాగుతుంటుంది. ముఖ్యంగా ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్, హోస్ట్ నాగార్జున ముందే హింట్స్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే హౌస్‌ను రెడ్, ఎల్లో, గ్రీన్ జోన్లుగా విభజించి టాస్కులు నిర్వహించారు. చివరికి ఊహించినట్టే దక్షి మరియు షాలినీలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసారు. నేటి 50వ ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూద్దాం.. 

బిగ్ బాస్ 50వ ఎపిసోడ్: ట్విస్ట్‌లతో సాగిన డబుల్ ఎలిమినేషన్.. హౌస్‌లో తగ్గిన లవ్ ట్రాక్స్.!
Biggboss 10
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2026 | 7:30 AM

Share

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఎల్లో, గ్రీన్ జోన్లలో ఉన్నప్పటికీ నామినేషన్స్‌లో ఉండటంతో వర్షిణి, ‌శివ్లకు ఆడియెన్స్ ఓట్లు వేశారా, లేదా.? అనే ఉత్కంఠకు నాగ్ తెరదించారు. వీళ్లిద్దరూ ఆడియెన్స్ ఓట్లతో సేఫ్ అయినట్లు నాగ్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత డ్యాన్యుబ్ ప్రాపర్టీస్ ఓనర్ హౌస్‌లోకి వచ్చి తన ప్రయాణం, వ్యాపార విశేషాలను పంచుకున్నారు. తర్వాత స్టేజ్ మీద ‘ఫిక్షనరీ టు డిక్షనరీ’ అనే సరదా టాస్క్‌ను ఇచ్చారు. ఒక సినిమా పేరును బొమ్మల రూపంలో గీస్తూ హింట్స్ ఇస్తే అవతల వారు గెస్ చేయాలి. ఈ ఆటలో సుధీర్ టీమ్ విజయం సాధించగా, ఆర్కే టీమ్ మాత్రం దారుణంగా ఓడిపోయింది. త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముకేష్, ఝాన్సీ ఈ ఆటలో పాయింట్స్ సాధించడంలో విఫలమయ్యారు. ఈ సరదా ఆట తర్వాత డ్యాన్యుబ్ ప్రమోషన్ ముగిసింది. ఆడియెన్స్ ఓట్ల ద్వారా రెడ్ జోన్‌లో ఉన్న దక్షి ఎలిమినేట్ అయ్యారు. ఎమోషనల్ అవుతూనే స్టేజ్ మీదకు వచ్చిన దక్షి తన షార్ట్ జర్నీని చూసి మురిసిపోయారు.

దక్షి ఎపిసోడ్ ముగిసిన వెంటనే విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ‘కల్ట్’ అంటూ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. తన సినిమా గురించి చెప్పమంటే కాస్త తడబడ్డా, “అందుకే సినిమాగా తీశా సర్” అంటూ ఆయన చెప్పిన సమాధానం నవ్వులు పూయించింది. రెడ్ జోన్‌లో మిగిలిన ఏడుగురిలోంచి, ఎల్లో జోన్‌లో ఉన్న నలుగురు కొందరిని సేవ్ చేశారు. ముందుగా శివ్, శ్వేతను సేవ్ చేశాడు, రామ్ ప్రసాద్- ఝాన్సీని సేవ్ చేశాడు, వర్షిణి- సుధీర్‌ని సేవ్ చేసింది. నరేష్- వంశీని సేవ్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన రోహిత్, షాలినీ, ఆర్కేలకు గ్రీన్ జోన్‌లో ఉన్న ఐదుగురు ఎగ్జిట్ బ్యాడ్జ్ పెట్టాల్సి వచ్చింది. నీతూ, దేబ్జానీలు షాలినీకి బ్యాడ్జ్ పెట్టగా.. ముకేష్, అమన్‌లు ఆర్కేకి బ్యాడ్జ్ పెట్టారు. చివరగా త్రిగుణ్ కూడా షాలినీకి బ్యాడ్జ్ పెట్టడంతో ఆమె ఎలిమినేషన్ ఖరారైంది.

అయితే హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలోనూ రోహిత్ – షాలినీల రొమాన్స్ ఏమాత్రం తగ్గలేదు. గేట్ వరకు వచ్చినా రోహిత్ వెనక్కి పిలిచి మరీ హగ్ ఇవగా, షాలినీ అతని చెవిలో గుసగుసలాడడం హైలైట్‌గా నిలిచింది. స్టేజ్ మీదకు వచ్చాక రోహిత్ విన్ కావాలని కోరుకుంటున్నట్లు షాలినీ తెలిపింది. ఆమె వెళ్లిపోతుండగా మైక్ మర్చిపోవడంతో నాగ్ మళ్లీ వెనక్కి పిలిచారు. ఇది చూసి రామ్ ప్రసాద్ షాక్ అవ్వడం, నాగ్ వెంటనే ఆయనకు కౌంటర్ వేయడం నవ్వులు పంచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us