Tollywood: పెద్ద స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్డెట్ మూవీ కాదు.. అయినా బాక్సాఫీస్ షేక్ చేసింది..
పెద్ద స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ మూవీ కాదు.. అయినప్పటికీ బాక్సాఫీస్ షేక్ చేసింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నవ్వకుండా క్షణం ఉండలేరు. ప్రతి క్షణం ప్రతి సీన్ మిమ్మల్ని పొట్టచెక్కయ్యేలా నవ్విస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ.

ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకోబోయే సినిమా ఒకటి. పెద్ద పెద్ద హీరోలు కాదు.. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది. ప్రేక్షకులను ఆద్యంతం కడుపుబ్బా నవ్వించింది. ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ కామెడీ మూవీస్ అంటే ముందు ఈ సినిమా పేరే గుర్తుకు వస్తుంది. ఈతరం ప్రేక్షకులను అంతగా తెలియకపోవచ్చు. కానీ 90’s సినీప్రియులకు ఇష్టమైన కామెడీ చిత్రాల్లో ఇది ముందుంటుంది హైరా ఫేరీ. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. మలయాళ సినిమాల్లో హాస్య రారాజు ప్రియదర్శన్ ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హిందీలో హంగామా, భూల్ భూలయ్యా, దే దానా దాన్ వంటి హిట్ చిత్రాలను రూపొందించారు.
అలాగే మరో బ్లాక్ బస్టర్ హిట్ కామెడీ మూవీ మాల మాల్ వీక్లి. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2006లో విడుదలైంది. ఇందులో పరేష్ రావల్, రితేష్ దేశ్‌ముఖ్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఇందులో రీమా సేన్, టిక్ తల్సానియా, శక్తి కపూర్ కీలకపాత్రలు పోషించారు.
కథ విషయానికి వస్తే.. మల మాల్ విక్లీ సినిమా ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. అక్కడ లీలాధర్ (పరేష్ రావల్) అనే వ్యక్తి లాటరీ గెలిచి ధనవంతుడు కావాలని కలలు కంటాడు. గ్రామానికి లాటరీ గెలిచిన వార్త వచ్చినప్పుడు లీలాధర్ గెలిచాడని అందరూ అనుకుంటారు. కానీ లీలాధర్ అనుమానాస్పదంగా మరణించడం.. ఆ డబ్బు కోసం పోరాటం ప్రారంభమైనప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆద్యంతం ఈ సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ సినిమాలో పెద్ద స్టార్లు లేకపోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అది చాలా వసూళ్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




