Priyanka Mohan: వారెవ్వా.. టాలీవుడ్ క్రేజీ హీరో సరసన ఛాన్స్.. ప్రియాంక మోహన్‌కు కలిసోస్తుందా.. ?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్. తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు సరైన హిట్టు రాలేదు. దీంతో తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.

ప్రియాంక మోహన్.. దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్లలో ఒకరు. 2019లో విడుదలైన ఓంత్ కథే హెల్లా అనే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ప్రియాంక ఆ తర్వాత కన్నడతోపాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంది. అదే ఏడాదిలో న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో నటిగా అందరి హృదయాలు గెలుచుకుంది. అందం, అభియనం.. అమాయకత్వంతో కట్టిపడేసింది. కానీ అంతగా అవకాశాలు మాత్రం అందుకోలేదు. ఆ తర్వాత 2021లో శ్రీకారం అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో శర్వానంద్ హీరోగా కనిపించారు.
అలాగే తమిళంలో హీరో సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. సూర్య నటించిన ఈథర్కుమ్ తుడింధవన్, శివకార్తికేయన్ నటించిన డాన్, టిక్ టోక్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వంటి తమిళ చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించింది. చివరగా రవిమోహన్ నటించిన బ్రదర్ సినిమాలో నటించింది. అలాగే ధనుష్ తెరకెక్కించిన జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ చిత్రంలో నటిస్తుంది.
అలాగే తాజాగా తెలుగులో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక మోహన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియాంక.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




