హీరో అజిత్ తల్లికి పాకిస్తాన్ తో ఏమిటి సంబంధం ??
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్. ఒకప్పుడు ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి వరస హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ కు చేరుకున్నాడు. ఇటీవలే పద్మ భూషణ్ అందుకున్న అజిత్ కుమార్ స్వయం కృషితో ఎదిగాడు. నేడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న అజిత్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి రేసర్ కూడా.. చదివింది కేవలం పదవ తరగతి.
అయితే బహుభాషాకోవిదుడు. అయితే అజిత్ కుమార్ మూలాలు అఖండ భారత దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన దేశంలో ఉన్నాయని మీకు తెలుసా..? అజిత్ కుమార్ తల్లిదండ్రులు రెండు రాష్ట్రాలకు చెందిన వారు.. అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యన్ కేరళ లోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందినవారు. అయితే సుబ్రహ్మణ్యన్ కేరళీయ తమిళుడు. అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్లోని కరాచీ ప్రాంతానికి చెందినవారు. అంటే సింధ్‌కు చెందిన సింధీ హిందూ. అంటే అతనికి సింధీ వారసత్వం ఉంది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందువులు భారత దేశానికి కాందిశీకులుగా తరలి వచ్చారు. అలా తరలి వచ్చిన అజిత్ అమ్మమ్మగారి ఫ్యామిలీ కలకత్తాకు వచ్చి స్థిరపడింది. అయితే అజిత్ కుమార్ మాత్రం సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించారు. అందుకే తెలుగు అబ్బాయిగా అభిమానిస్తారు. ఈ విషయాన్నీ అజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. విభజనకు ముందు తన తల్లి పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చిందని అసలు విషయాన్ని రివీల్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూర్చుంటే 2 బిర్యానీలు ఖతం !! యాంకరమ్మ పాత ఫోటోలు చూసి అందరూ షాక్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
