కమ్మగా ఉన్నాయని మైదా వంటకాలు తెగ తింటున్నారా
కవ్వ ను ఉపయోగించి మైదా తయారు చేస్తారు. బయట మనం తినే చాలా రకాల ఆహారాల్లో మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబర్ ను పూర్తిగా తొలగించి రిఫైన్ చేసి ఈ మైదా పిండిని తయారు చేస్తారు. అందువల్ల మైదా పిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతే తప్ప మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మైదా తినడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లటి విషంగా మైదాను చెబుతారు నిపుణులు. రిఫైన్ చేసిన గోధుమ పిండిలో పోషకాలు ఉండవు. ముఖ్యంగా ఫైబర్ అసలే ఉండదు. బి విటమిన్లు, థయామిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కోల్పోవలసి వస్తుందని చెబుతున్నారు. మైదా వంటకాలతో రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాను తరచు తింటూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగే ప్రమాదం సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్కు దారితీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడంతో పాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విటమిన్ బి12 లోపిస్తే చిక్కులేనా..?
చిరుతను హత్తుకుని ముద్దు పెట్టబోయింది !! ఏం జరిగిందంటే..?
తందూరి రోటీ కోసం పెళ్లిలో గొడవ ఇద్దరు యువకులు మృ**తి
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

